అయితే ఇటువంటి సమయంలోనే అషు రెడ్డి వ్యవహారంలో కొత్త విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే సెటిల్మెంట్ కోసం ఎన్నారై ధర్మేంద్రకు ప్రతిపాదనలు పంపించినట్లు ఫోన్ కాల్స్ ఆడియో రికార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఆడియోలో ఏముంది? ధర్మేంద్ర కు అషు ఇచ్చిన ఆఫర్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. ఆడియోలో ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం అంటూ ఎన్నారై ధర్మేంద్రకు అషు ప్రతిపాదన తీసుకువచ్చింది. పెద్దమనుషుల మధ్య మాట్లాడుకుందాం తన తరఫునుంచి వేణు స్వామి, అలాగే సీరియల్ నటి ప్రవీణ్ అక్క కూడా వస్తుందంటూ చెప్పినట్లుగా వినిపిస్తోంది.
లేకపోతే మనమిద్దరమే కలిసి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామా అని మరో ఆఫర్ కూడా ఇచ్చింది అషు రెడ్డి.. అంతేకాకుండా తనకు మే నెల వరకు టైం ఇస్తే కోటిన్నర రూపాయలు ఇస్తానని మిగిలిన డబ్బులను లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇస్తానంటూ తెలియజేసినట్లు వినిపిస్తోంది. కానీ ఈ వివాదంలోకి తన తల్లిని అక్కని మాత్రం లాగదు అంటూ అషు రెడ్డి మాట్లాడినట్లుగా వినిపిస్తోంది. ఒకవేళ ఇవేవీ కుదరదు అంటే వేధింపుల కేసు పెడతానని ధర్మేంద్ర నీ హెచ్చరించింది అషు రెడ్డి. అలాగే చివరిగా నీ ముఖం మళ్ళీ చూడాలనుకోవడం లేదు దీని గురించి అసలు మాట్లాడుకోవడం లేదంటే వెల్లడించింది అషు రెడ్డి. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఆడియో కూడా వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి