ఎండాకాలం వచ్చిందంటే చాలు కొన్ని తినే పండ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. అందులో పుచ్చకాయ కూడా ఒకటి. అయితే ఎండలో ఉంచిన పుచ్చకాయ తినడం వల్ల చాలా ప్రమాదమని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయలో సహజంగానే చక్కెర నీరు పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల వేడికి అవి త్వరగా స్పందిస్తాయని బయట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా దాటితే పండు లోపల కూడా చాలా వేడిగా ఉంటుందట. దీంతో ఆ వేడికి పుచ్చకాయలో ఉండే చక్కెరలు పులియడం ప్రారంభిస్తాయి. ఇవి ఎన్నో వాయువులను కూడా విడుదల చేస్తాయి.


పుచ్చకాయను కట్ చేసినప్పుడు లోపల నురుగుగా లేదా సబ్బు నీళ్లలా మారడం గమనిస్తే ఆ పండు లోపల తీవ్రమైన ఫెర్మెంటేషన్  జరిగిందని గుర్తించాలి. ఇది పాడైపోయిన పండుకి సంకేతము. అలాగే పండు ని కట్ చేసినప్పుడు లేదా పుల్లటి లేదా ఘాటైన వాసన వస్తే అది కచ్చితంగా విషపూరితమైనదిగా గుర్తించాలి.



పుచ్చకాయ తొక్కల పైన సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల పై తొక్క బలహీనపడేలా చేస్తుంది. దీంతో చిన్నపాటి చీలికలు కూడా ఏర్పడతాయి. ఇది కంటికి కనిపించని రంధ్రాల ద్వారా ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్లి లోపల ఉండే గుజ్జును కలుషితం చేస్తుంది. దీని ఫలితంగా తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులు, విరేచనాలు, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయట కొన్నిసార్లు ప్రాణానికి కూడా ముప్పు తెస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.


పుచ్చకాయను మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత కచ్చితంగా శుభ్రంగా కడగాలి. ముఖ్యంగా ఉప్పునీరు లేదా పంపు కింద నీటితో శుభ్రపరచాలి దీనివల్ల తొక్క పైన ఉండే బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా చేస్తుంది. అలాగే మనం పుచ్చకాయను కట్ చేసిన తర్వాత గది ఉష్ణోగ్రతల వద్ద రెండు మూడు గంటలకంటే ఎక్కువగా ఉంచకూడదు ఒకవేళ ఫ్రిడ్జ్ లో ఉంచినట్లు అయితే 24 గంటల లోపు తినేయాలి. ముఖ్యంగా పుచ్చకాయ తిన్న తర్వాత నీటిని ఎక్కువగా తాగితే జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: