రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. ఈ సినిమా జూన్ 24 చాలా గ్రాండ్గా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార మరి కొంతమంది నటి నటులు నటిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా , అటు షూటింగ్, ఇటు యుద్ధం వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. అన్ని అవధులు దాటి ఈ ఏడాది జూన్ 4న విడుదల అవుతుంది అనుకున్న సమయంలో తాజాగా మేకర్ వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని యశ్ ఒక ఎమోషనల్ తో లెటర్ ద్వారా తెలియజేశారు.


ఇటీవలే జరిగిన సినిమాకాన్ లో టాక్సిక్  సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి యశ్ టీమ్ ఆశ్చర్యపోయిందట. ఈ సినిమాకి ఉన్న గ్లోబల్ స్థాయి మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని, ప్రపంచవ్యాప్తంగా  ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద సంస్థలతో డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలు కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా గ్లోబల్ స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాన్ కోసం మరికొంత సమయం అవసరం అంటూ యశ్ తెలియజేశారు.


భారతీయ సినిమా గ్లోబల్ స్టేజ్ పై గర్వపడేలా ఉండాలనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ యశ్  లేఖలో తెలియజేశారు. సినిమాకు సంబంధించి షూటింగ్ మాత్రం పూర్తిగా అయ్యిందని అవుట్ ఫుట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని యశ్ తెలియజేశారు. అలాగే కొన్ని చిత్ర కథలు ప్రయాణాలు ఓపికను కోరుతాయని, కచ్చితంగా మీరు సెలబ్రేట్ చేసుకునే ఒక గొప్ప సినిమాని అందిస్తామంటూ ప్రామిస్ చేస్తున్నానని యశ్ లేఖలో రాసుకొచ్చారు. అందుకోసం అభిమానులు ఓపిక పట్టాల్సింది అంటూ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటిస్తామని తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ట్వీట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: