ఇటీవల కాలంలో ఇన్ స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారుతోంది. తమ ఖాతాలో డబ్బులు వేస్తే చాలు, పిచ్చెక్కించే ఫోటోలతో, వీడియోలతో కుర్రాలను ఆశ పెట్టేలా తమ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతూ ఉన్నారు సెలబ్రెటీలు. ఇటీవలే యాంకర్ విష్ణు ప్రియా ఇలాంటి సబ్స్క్రైబ్ పద్ధతిని  మొదలుపెట్టి భారీగా సంపాదిస్తోంది. దీంతో ఈమె పైన పోలీస్ కేసు కూడా నమోదు అయ్యింది. దీనిపైన ఇంకా విచారణ జరుగుతోంది.అలాగే హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా ఇలాంటి పద్ధతే మొదలు పెట్టింది. అయితే ఈమె మాత్రం దేవుడికి సంబంధించిన కంటెంట్ మాత్రమే ఇస్తానంటు తెలియజేసింది.ఇలా చాలామంది ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ని మొదలుపెట్టారు.


ఇప్పుడు తాజాగా మరొక హీరోయిన్ కూడా ఇన్స్టాగ్రామ్  సబ్స్క్రిప్షన్ ని మొదలుపెట్టింది. ఆమె ఎవరో కాదు చిరుత చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నేహా శర్మ. బాలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో రెండు మూడు చిత్రాలలో అలరించిన నేహా శర్మ ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయింది. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది. నిరంతరం సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలు షేర్ చేస్తే కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తూ ఉంటుంది. అందాల ఆరబోయడంలో ఓరేంజులో ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.


అయితే ఇప్పుడు నేహా శర్మ తన ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ని మొదలుపెట్టింది. ఎక్స్క్లూజు కంటెంట్ ఇస్తానంటూ రూ .290 రూపాయలు కడితే కంటెంట్ అందుతుంది అంటుంది నేహా శర్మ. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ ద్వారా పలు రకాల బ్రాండ్లను ప్రమోషన్ చేస్తే భారీగానే సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఉపయోగించి క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్నారు. మరి వీటివల్ల సినిమా అవకాశాలు ఏమైనా అందుకొని అవకాశాలు ఉంటాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: