టాలీవుడ్లో స్టార్ డైరక్టర్స్ లో రాజమౌలిది ఓ సెపరేట్ స్టైల్.. అంతేకాదు తీసిన ప్రతి సినిమాను సూపర్ హిట్ అందుకున్న దర్శక ధీరుడు తన ప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అయితే అంతటి స్టార్ డం ఉన్న దర్శకుడితో ప్రస్తుతం మరో దర్శకుడు బోయపాటి శ్రీనుని పోల్చుతున్నారు. అదెలా అంటే వివరాలు ఇలా ఉన్నాయి..


రాజమౌళి, బోయపాటి ఇద్దరు మంచి దర్శకులే.. రాజమౌళి ఇప్పటివరకు ఫ్లాప్ అనే మాట వినలేదు.. ఇక బోయపాటి కూడా తీసిన సినిమాలన్ని హిట్స్ అందుకున్నాయి. కెరియర్ లో ఒక్క దమ్ము తప్ప తన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకున్న బోయపాటి రాజమౌలితో ఓ పోలిక పెడుతున్నారు సిని ప్రియులు.


సరైనోడు షూటింగ్లో బోయపాటి, అల్లు అర్జున్ :


అయితే రాజమౌళికి, బోయపాటికి పోలిక ఎక్కడా అంటే సినిమా ఎమోషన్ మరియు ఇంటర్వల్ బ్యాంగ్ లో అనేస్తున్నారు. తన సినిమాలో రాజమౌళి ఎంత ఎమోషన్స్ ను పండిస్తాడో బోయపాటి శ్రీను కూడా అదే విధంగా డైరెక్ట్ చేస్తాడని.. ఇక ఇంటర్వల్ బ్యాంగ్ లో మంచి ఫైట్ సీక్వెన్స్ ని ప్లాన్ చేయడంలో రాజమౌళి తర్వాత స్థానం బోయపాటిదే అని అంటున్నారు. 


ఇక రీసెంట్ రిలీజ్ సరైనోడు సినిమా హిట్టా ఫట్టా అన్నది పక్కన పెడితే దర్శకత్వం పరంగా తన వరకు సూపర్ అనిపించుకున్నాడు బోయపాటి. అల్లు అర్జున్ కిమాస్ ఊర మాస్ ఇమేజ్ తీసుకురావడంలో బోయపాటి నూటికి నూరు పాళ్లు సక్సెస్ అయ్యాడు. సో ఈ లెక్కలన్ని చూస్తుంటే రాజమౌళి తర్వార బోయపాటి అనక తప్పదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: