ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో నందిగామ అసెంబ్లీ కూడా కీలకపాత్ర పోషించనుంది. ఇక ఈ ప్రాంతం నుండి వైసీపీ అభ్యర్థిగా మొండితోక జగన్మోహన్ రావు పోటీ చేస్తూ ఉండగా... టీడీపీ పార్టీ నుండి కూటమి అభ్యర్థిగా తంగిరాల సౌమ్య పోటీ చేస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ నామినేషన్లు కూడా దాఖలు చేశారు. మరి వీరి బలాబలాలు ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం 2013 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు.

జగన్‌మోహనరావు 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు చేతిలో 5212 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య పై 10881 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ఆయన ఫిబ్రవరి 2020 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికార వికేంద్రీకరణ & మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా కృష్ణా జిల్లా నందిగామ నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేశాడు. ఇకపోతే పోయినసారి ఎలక్షన్ లలో జగన్మోహన్ రావు , తంగిరాల సౌమ్య తలపడగా అందులో జగన్మోహన్ రావు సైడ్ జనాలు నిలిచారు.  ఇకపోతే 2014 వ సంవత్సరం ఓటమి తర్వాత పుంజుకున్న ఈయన 2019 ఎలక్షన్ల తర్వాత కూడా జనాల్లో మంచి క్రేజ్ ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత దానినే కంటిన్యూ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. దానితో సౌమ్య కంటే కూడా జగన్మోహన్ రావు సైడ్ జనాలు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: