అందంగా ఉంటే సరిపోదేమో. దాన్ని ప్రదర్శిస్తేనే కదా చాన్సులు వచ్చేది. కొంతమందికి అందం ఉన్నా అవకాశాలు రావు. దానికి వారు ఎంచుకున్న సినిమాలు. రిలీజ్ అయిన టైమ్ . ఇలా అన్నీ ఉండి  బాడ్ లక్ వారిని వెనక్కు నెట్టేస్తుంది. అలాటపుడు మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలని చేసే ప్రయత్నాల్లో ఎన్నో విన్యాసాలు ఉంటాయి.


సొగసు ఇంద్రదనస్సులు ఉంటాయి. అలా ఇపుడు తన హాట్ ఫోజులతో మ‌త్తెక్కిస్తోంది అమైరా దస్తూర్. ఈ అమ్మడు మంజుల దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ చిత్రంలో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించాడు. కానీ తొలి ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. పైగా ఆ సినిమాలో పక్కింటమ్మాయి తరహా పాత్రలో నటించడం అమైరా మైలేజ్ కి అడ్డంకిగా మారింది. మొదటి సినిమా తర్వాత ఎవరూ పిలిచి అవకాశం ఇచ్చిందే లేదు. అందుకే ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉనికిని కోల్పోయి కొత్త పరిశ్రమల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.


అందులో భాగంగా లేతెస్ట్ గా కొన్ని హాట్ హాట్ ఇమేజ్ లతో ముందుకు వచ్చింది. తాను ఎక్కడా తగ్గడం లేదని కూడా చాటుకుంటోంది. అమైరా ఈ కొత్త ఫోటోషూట్ లో మునుపటి కంటే హాట్ గా కనిపించింది. అందమైన నవ్వుతో కుర్రకారు గాలం వేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత కెరీర్ ని పరిశీలిస్తే.. 2019లో ఈ అమ్మడు ఓ రెండు హిందీ చిత్రాల్లో - ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఊడి ఊడి ఉజైకానుమ్ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో మెంటల్ హై క్యా మేడ్ ఇన్ చైనా చిత్రాల్లో ఆడిపాడుతోంది. మరి తెలుగులో ఎంట్రీ ఎపుడంటే మాత్రం మన హీరోలు, నిర్మాతలు చెప్పాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: