స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి బాహుబలి 2 వరకు రాజమౌళి తీసిన సినిమాలు చూసుంటే.. హీరో ఎవరు.. అనే విషయం పెద్దగా పట్టించుకోవాల్సిన అవరం లేదు.  ఎందుకంటే హీరో ఎవరు అనే దానికంటే రాజమౌళి డైరెక్షన్ ఎలా ఉన్నది అనేది మాత్రమే చూస్తారు.  రాజమౌళి సినిమాలు దాదాపుగా అద్భుతంగా ఉంటాయి .  ప్రతి సినిమాను  తనదైన శైలిలో చిత్రీకరించారు.  


స్టూడెంట్ నెంబర్ 1 అంటూ ఎన్టీఆర్ తో సినిమా చేశారు.  ఆ తరువాత రాజమౌళి తిరిగి ఎన్టీఆర్ సింహాద్రి సినిమా చేశారు.  ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్.  ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా వచ్చింది. ఈ మూవీ హిట్టయ్యాక వరసగా సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి సీరీస్ సినిమాలు తీశారు.  


ఇందులో ఒక్క సినిమా కూడా ఫెయిల్ కాలేదు.  బాహుబలి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  బాహుబలి 1 సినిమా సూపర్ హిట్టయితే.. ఆ తరువాత వచ్చిన బాహుబలి 2 భారీ హిట్ అనాలో లేదంటే మరేమనాలో తెలియదు.  ఆ స్థాయిలో హిట్టైంది.  ఒక ప్రాంతీయ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది అంటే అది రాజమౌళి వలనే అని చెప్పాలి.  బాహుబలి 1 తీసి హిట్ కొట్టిన తరువాత రెండో సినిమా తీసి దానికి మించి హిట్ కొట్టడం అన్నది కేవలం బాహుబలికి మాత్రమే సాధ్యం అయ్యింది.  


ఇప్పుడు దానికి మించిన సినిమా అంటూ ఆర్ఆర్ఆర్ ను తీస్తున్నాడు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు.   మల్టీస్టారర్ గా తెరెక్కుతున్న ఈ సినిమాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో  దేశం కోసం తెల్లదొరలతో పోరాటం చేసిన వీరుల గురించి చూపించబోతున్నారు.  ఒకరు అల్లూరి సీతారామ రాజు కాగా, రెండో వ్యక్తి కొమరం భీం.  ఇద్దరు కలిసి పోరాటం చేసినట్టుగా చరిత్రలో లేదు. కానీ ఇది సినిమా కాబట్టి ఈ ఇద్దరు వీరులను కలిపి చూపిస్తున్నారు.  అదే సినిమాకు ప్లస్ అవుతుంది.  సినిమాకు హైప్  తీసుకొచ్చే పాయింట్ అవుతుంది.  అంతేకాదు, ప్రజల నాడి బాగా తెలిసిన వ్యక్తి రాజమౌళి. అందుకే సినిమాలో హీరో ఎవరు అన్నది కాకుండా రాజమౌళి సినిమానా అయితే హిట్ గ్యారెంటీ అనే స్థాయికి ఎదిగాడు.  దట్ ఈజ్ రాజమౌళి.  


మరింత సమాచారం తెలుసుకోండి: