శ్రీ హేమలంబ నామ ఉగాది ఉత్సవాలు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో సిలికానాంధ్ర యూనివర్సిటీలోని లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పంచ ఘట నాదలయవిన్యాసం, వాద్య సంగీత గోష్టి (ఫ్యుజన్) కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. ప్రపంచ ప్రఖ్యాత ఘటవాయిద్య  విద్వాంసులు పద్మభూషణ్ విక్కు వినాయకరాం తన శిష్య బృందంతో నిర్వహించిన 'పంచ ఘట నాదలయ విన్యాసం' తో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ  ప్రాంగణం  పరవశించింది.


సిలికానాంధ్ర యూనివర్సిటీలో ఘనంగా ఉగాది వేడుకలు

ఈ సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో విక్కు వినాయకరాం మాట్లాడుతూ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పవిత్రతో కూడిన దివ్యత్వం ఉన్నట్టుగా అనుభూతి కలుగుతోందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఏ ఆశయం కోసం ప్రారంభించారో అది తప్పక నెరవేరుతుందన్నారు. తానూ ఇందులో భాగమై, విద్యార్ధులకు విద్య నేర్పడానికి సిద్ధం అని ప్రకటించారు. తాను కచేరీ చేసే ఘటం ని సంతకం చేసి కానుకగా సిలికానాంధ్ర యూనివర్సిటీకి అందజేశారు. అనంతరం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం రాబోయే ఫాల్ సెమిస్టర్ కరపత్రాలు, గోడపత్రికను పద్మభూషణ్ విక్కు వినాయకరాం ఆవిష్కరించి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, యూనివర్సిటీ కార్యవర్గానికి అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: