
ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఎంతో మంది తమ పుట్టిన ఊరిని పెరిగిన వాతావరణాన్ని విడిచి పెట్టి వెళ్తూ విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలని పోషించుకుంటారు..విదేశాలలో ఉద్యోగాలు చేస్తే తమకి ఆర్ధిక కష్టాలు తీరుతాయి అనే ఒకే ఒక్క కారణంగా అక్కడికి వెళ్లి నానా చాకిరీ చేస్తూ ఎన్నో కక్ష్టలు అనుభవిస్తూ ఉంటారు..అయితే తాజాగా తన కుటుంభం కోసం బుదాబీ వెళ్ళిన ఓ యువకుడు..దేశం కాని దేశం లో తనవారు ఎవరూ లేని చోట చివరి చూపు కూడా తన వాళ్లకి దక్కకుండా తనువు చాలించాడు. వివరాలలోకి వెళ్తే.
మండలంలోని మడకపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి నూకరాజు,నరసమ్మ దంపతులకు ఇద్దరు సంతానం, కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెకు వివాహం జరిగింది...అయితే కటిక పేదరికంలో ఉన్న ఆ కుటుంభానికి తోడుగా ఉండటానికి మహేష్ అనే పేదరికంలో ఉన్న కుటుంబానికి చేయూత ఇచ్చేందుకు కుమారుడు మహేష్(25) గాజువాక ఏజెంట్ ద్వారా ఐదేళ్ల క్రితం అబుదాబీ వెళ్లాడు..అక్కడ రెండేళ్లపాటు వెల్డర్‌గా పనిచేసి, ఇంటికి వచ్చేశాడు.
అయితే మళ్ళీ 22 నెలల క్రితం అబుదాబీ వెళ్లాడు మహేష్ అయితే ఈ లోగానే ఈ మహేష్ తల్లి తండ్రులకి పిడుగులాంటి వార్తా అందింది...మహేష్ గురువారం రాత్రి విధులు ముగించుకుని వెళ్ళిన మహేష్ కి అనుకోకుండా రాత్రి సమయంలో గుండె పోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు..అయితే నిన్నా మొన్నటి వరకూ ఇక్కడే తిరిగిన తన కొడుకు మృతి చెందటంతో అతడి తల్లి తండ్రులు షాక్ లో ఉన్నారు