అమెరికాలో భారతీయ సంఘాలు అన్నీ ఏకం అయ్యాయి.ప్రాంతాలతో సంభంధం లేకుండా భారత దేశానికి చెందిన ఎన్ని సంఘాలు అయితే అమెరికాలో ఉన్నాయో అని సంఘాలు ఒక్క తాటిపైకి రానున్నాయి. వారి ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే S-386 బిల్లు సెనేట్ లో ఆమోదం పొందటం. అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించడం. ఈ బిల్లు గనుకా సెనేట్ లో ఆమోదం పొందితే ఏకంగా 3 లక్షల మంది భారతీయులకి భారీ ఊరట లభించ నుందట. లేకపొతే 151 ఏళ్ళ వరకూ భారతీయులకి గ్రీన్ కార్డ్ కోటాలో భారీ కోత ఉంటుందని తెలుస్తోంది.

 

అసలు S-386 ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే. అమెరికాలో ఉంటున్న వలస వాసులకి గతంలో దేశాల వారీగా కేవలం 7 శాతం మాత్రమే గ్రీన్ కార్డ్ కోటా మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్న తరుణంలో ఫిబ్రవరి -2019 లో S-386 బిల్లు ని ప్రవేశ పెట్టారు. దీని కారణంగా 7 నుంచీ 15 శాతానికి ఈ కోటా పెరుగుతుంది. దాంతో సుమారు 3 లక్షల మంది భారతీయులకి గ్రీన్ కార్డ్ లభించనుంది. అయితే ఈ బిల్లు ఆమోదానికి ఇప్పటి వరకూ నోచుకోని క్రమంలో..

 

అమెరికాలో ఉంటున్న భారతీయులు ఏకం అయ్యి ఓ భారీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్ కి తానా, కేరళా, గుజరాత్, బెంగాలి, కన్నడ , మొదలు భారతీయ అసోసియేషన్స్ అన్నీ ఏకం అయ్యాయి. చికాగోలో షిరిడీ సాయి మందిరంలో సుమారు 300 మంది భారతీయులు కలుసుకుని భవిష్యత్తు కార్యాచరణ పై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఈ బిల్లు ఆమోదం అయ్యేలా సెనేట్ దృష్టికి ప్రస్తుత పరిస్థితులు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: