పాకిస్తాన్ కు ఇండియా మరోసారి బుద్ది చెప్పింది. అంతర్జాతీయ వేదికపైనే చెప్పుతో కొట్టినట్టు బదులు ఇచ్చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి వేదికగా జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్ పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

 

మండలి 43వ సమావేశంలో మాట్లాడిన పాక్ ప్రతినిధి జమ్మూకశ్మీర్ లో మానవ హక్కులు దెబ్బతిన్నాయని ప్రస్తావించారు. పాక్ విమర్శలకు భారత్ కూడా దీటుగానే బదులిచ్చింది. ఐక్య రాజ్య సమితిలోని భారత శాశ్వత మిషన్ తొలి కార్యదర్శి విమర్శ్ ఆర్యన్ పాక్ వాదనను ఎండగట్టారు. దీటుగా బదులు ఇచ్చారు.

 

 

 

పాక్ ను ఉగ్రవాదానికి కేంద్ర బింధువుగా వర్ణించారు. పాకిస్తాన్ వంటి దేశాలు ఇతరులకు హితబోధ చేసే ముందు తమ సొంత సంగతులు గర్తుంచుకోవాలన్ని ఓ షాకింగ్ డైలాగ్ వదిలారు. జమ్మూకశ్మీర్ లో నాలుగు నెలలుగా భారత్ ప్రజాస్వామ్య, ప్రగతిశీల శాసన సంస్కరణలను అమలు చేసిందని ఆర్యన్ అన్నారు. ఈ సంస్కరణలు మొత్తం భారతదేశ ప్రజల మానవహక్కులను పరిరక్షిస్తాయన్నారు.

 

 

 

 

అంతే కాదు.. పాక్ కుట్రలు ఛేదించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయన్నారు. జమ్మూకశ్మీర్ అంశంపై టీకప్పులో తుపాను సృష్టించేందుకు.. అనేక వేదికలపై పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను... అంతర్జాతీయ సమాజం గమనించిందని ఆర్యన్ పేర్కొన్నారు. మైనార్టీలను స్వాతంత్ర్యం నాటి నుంచే...... పాక్ అణచివేసిందని ఆరోపించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: