కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు భారీగా సంస్కరణలు చేపడుతున్నాయి. ఆయా  దేశాల చరిత్రలో తీసుకోనటువంటి చర్యలకి ప్రస్తుత కరోనా ప్రభావంతో ఉపక్రమించక తప్పడంలేదు. ఇక అగ్ర రాజ్యానికి ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితులో ఉంది. ప్రాణ నష్టం, ఆర్ధిక నష్టం, రాజకీయంగా నష్టం ఇలా అన్ని వైపులా ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకత నడుస్తూ ఉంది..దాంతో ట్రంప్ పరిస్థితులని తన ఆధీనంలో తీసుకోవడానికి మళ్ళీ అమెరికాని గాడిలో పెట్టేందుకు కటినమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా..

IHG

అమెరికాలోని అన్ని రకాల వలస వీసాలపై తాత్కాలిక నిషేధం విధించారు. అంతేకాదు అందకు సంభందించిన ఉత్తర్వులపై త్వరలో సంతకం చేయనున్నట్టుగా  ప్రకటించారు. కరోనా బారి నుంచీ అమెరికా ప్రజలని కాపాడటానికి అమెరికాలో ఉద్యోగ భద్రత కలిపించడానికి ట్రంప్ ఈ చర్యలకి పూనుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ట్రంప్ తీసుకున ఈ వీసా రద్దు నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

IHG'll 'suspend immigration' over <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CORONAVIRUS' target='_blank' title='coronavirus-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>coronavirus</a> concerns ...

కరోనాని కంట్రోల్ చేయలేక ఎంతో మంది అమెరికా ప్రజల ప్రాణాలని కాపాడలేక  చతికలపడిన ట్రంప్ తన తప్పులని కప్పి పుచ్చుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు నిపుణులు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం హెచ్-1 బీ వీసాపై కూడా ప్రభావం చూపించనున్న నేపధ్యంలో ట్రంప్ గత అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీ  అనుగుణంగానే మళ్ళీ ఎన్నికలు వచ్చేలోగా ఇచ్చిన మాటని నిలబెట్టుకునే పదాలో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.. ఒక వేళ ట్రంప్ ఈ ప్రకటించిన విధంగా సంతకం చేస్తే ముందుగ నష్టపోయే వరుసలో ఉండేది భారతీయులేనని అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: