అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌నితీరుపై ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ప‌రోక్ష విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓ కాలేజీలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్‌ సెరిమనీలో పాల్గొన్న ఒబామా.. అమెరికాలో నల్లజాతీయుల‌పై జరుగుతున్న దాడులు, కరోనా వైర‌స్ కార‌ణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులు త‌దిత‌ర‌ అంశాలపై మాట్లాడారు. కరోనాను వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్  ఘోరంగా విఫలమయ్యారంటూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు  బరాక్ ఒబామా తీవ్రంగా విమర్శించారు. కరోనాను నియంత్రించే విషయంలో ట్రంప్ తీరు ఏ మాత్రం సమంజసంగా లేదన్నారు.  ఏండ్లు గ‌డుస్తున్నా న‌ల్ల‌జాతీయుల‌పై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంద‌న్న ఒబామా.. ఫిబ్రవరి 23న జార్జియాలో 25 ఏండ్ల‌ అహ్మద్‌ ఆర్బెరీని కాల్చిచంపిన ఘటనను గుర్తుచేశారు. 

 

ఒక్క అమెరికా అనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఒబామా అభిప్రాయపడ్డారు.  కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింద‌ని, 75,000 మందికి పైగా అమెరికన్‌ల ప్రాణాలు తీసింద‌ని, ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో పాల‌కులు విఫ‌ల‌మ‌య్యార‌ని ఒబామా విమ‌ర్శించారు. ఇదిలా ఉంటే తాజాగా ఒబామా పై అమెరికా అధ్యక్షులు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు.  వైట్ హౌజ్ లో ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన (ఒబామా) అసమర్థ అధ్యక్షుడు. పూర్తిగా అసమర్థ అధ్యక్షుడు. నేను చెప్పగలిగే విషయం ఇదే' అని వ్యాఖ్యానించారు.

 

కాగా, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ బాధ్యతను ఎలా సమర్థంగా నిర్వహిస్తున్నారో చెప్పాలని ట్రంప్‌పై ఒబామా పరోక్షంగా విమర్శలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పై కోట్ల మంది యుద్దం చేస్తున్నారని.. అమెరికాలో ప్రజల సురక్షిత కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ట్రంప్.  కొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: