కడుపులో ఉన్నప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రయోజకుడిని చేసిన తల్లికి మనం ఎంత చేసిన తక్కువే. ఇంకా అలాంటి అమ్మకు ఆరోగ్యం బాగాలేదు.. అనారోగ్యంతో కష్టపడుతుంది అని తెలిసితె ఏ కొడుకు అయినా కూతురు అయినా ఆగమేఘాలపై తల్లిని చూడటానికి వచ్చి వైద్యులను సంప్రదించి ఆరోగ్యంగా చేస్తారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే దుబాయిలో స్థిరపడిన గౌతమ్ బంకా అనే భారతీయుడు.. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసేందుకు  ఆదివారం దుబాయి నుంచి భారత్‌‌లోని కోల్‌కతాకు బయలుదేరాడు. అయితే గౌతమ్‌తో పాటు అదే విమానంలో మొత్తంగా 170 మంది భారతీయులు ప్రయాణించారు. అయితే ఈ విమానం వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విమనాం కాదు. 

 

గౌతమ్ కేవలం క్యాన్సర్ స్టేజ్ 3తో బాధపడుతున్న తల్లిని చూసేందుకు ప్రత్యేకంగా విమానాన్ని ఏర్పాటు చేశాడు. మొదట కేవలం పది మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ప్రత్యేక విమానాన్ని గౌతమ్ బుక్ చేశాడు. అయితే అందులో మరో నాలుగు సీట్లు మిగిలిపోయాయి. ఇంకా ఆ సమయంలోనే గౌతమ్‌కు మరో అద్భుతమైన ఐడియా వచ్చింది. 

 

ఈ చిన్న విమానం ఎందుకు? పెద్ద విమానం బుక్ చేసి తక్కువ ధరకే భారతీయులను తనతో పాటు తీసుకెళ్తే బాగుంటుంది కదా అని గౌతమ్ అనుకున్నాడు. అయితే వెంటనే 170 మంది సామర్ధ్యం ఉన్న విమానాన్ని 39 లక్షల 11 వేల రూపాయిలకు బుక్ చేశాడు. ఇంకా తన స్నేహితుల సహాయంతో ఎవరెవరు కోల్‌కతాకు వెళ్లాలనుకుంటున్నారో వారి సమాచారాన్ని సేకరించాడు. 

 

అంతే భారత్ కు వచ్చెనందుకు కొన్ని వందలమంది ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో గౌతమ్ తో కలిపి 170 మంది భారతీయులు ఆదివారం మధ్యాహ్నం దుబాయి నుంచి కోల్‌కతాకు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. గౌతమ్ ఆలోచన అందరికి నచ్చడంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు అంత ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: