ఈ తరుణంలో ఒక వార్త ఏంటీ అంటే మన ఐటి నిపుణుల కోసం బ్రిటన్ ఎక్కువగా ఎదురు చూస్తుంది. అలాగే యూరప్ దేశాలు మన కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా సరే మన వారి కారణంగానే అమెరికాలో ఐటి రంగం స్థాయి పెరిగింది అనే మాట వాస్తవం. అందుకే ఇప్పుడు మన వారికి భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారు మా దగ్గరకి రావాలి అంటూ బ్రిటన్ సహా ఇటలీ వంటి దేశాలు ఆఫర్లు ఇస్తున్నాయి. మీకు మేమున్నాం రండి అంటూ రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి.
అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి మంచి ఆఫర్లు ఇవ్వడమే కాకుండా జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తున్నాయి. కరోనా దెబ్బకు ఐటి రంగం కుదేలు అయిపోయింది. దాన్ని నిలబెట్టాలి అంటే నిపుణులు చాలా అవసరం. అందుకే ఇప్పుడు వారికి ఆహ్వానాలు పలుకుతున్నాయి ఐటి కంపెనీలు అన్నీ కూడా. త్వరలోనే దీనిపై కొన్ని కంపెనీలు ఒక ప్రకటన కూడా విడుదల చేసే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. ఏయే కంపెనీలు ఆఫర్లు ఇస్తాయో అనేది చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి