మనదేశంలో 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధమవుతున్నది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలు అలాగే మాజీ కేంద్ర మంత్రులతో కమిటీని కూడా వేసిన సంగతి తెలిసిందే. దీంతో దీనిని ఏ విధంగా నిర్వహిస్తారు ఏంటనే దానిపై అందరిలో కూడా ఒక రకమైన ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా కొన్ని ప్రత్యేక వేదికలను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. విదేశాల నుంచి ఎవరు వస్తారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో దాదాపు 75 దేశాల అధ్యక్షులను అలాగే ప్రధానులను ఆహ్వానించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ భావిస్తున్నట్టుగా సమాచారం.

అమెరికా సన్నిహిత దేశాలను కూడా ఈ వేడుకలకు ఆహ్వానించే విధంగా ప్రధానమంత్రి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు కూడా చేశారు. కొన్ని దేశాల అధినేతలు భారత్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారని కాబట్టి వాళ్ళతో మాట్లాడాలని తాను కూడా వాళ్ళతో చర్చలు జరుపుతానని వాళ్ళు ఈ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వాన పత్రాలను కూడా సిద్ధం చేయాలని ఆయా దేశాలతో భారత్ సంబంధాలను ఆహ్వాన పత్రాలలో స్పష్టంగా పేర్కొనాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.

అధికారులు అందరూ కూడా ఈ విషయంలో సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇక కేంద్ర మంత్రులు కూడా దీనికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అమెరికా నుంచి క్యాబినెట్ మంత్రులు అందరూ వచ్చే విధంగా అలాగే బ్రిటన్ యూరప్ దేశాల్లో కొన్ని దేశాల అధినేతలు కూడా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: