సాధారణంగా రెండు దేశాల్లో యుద్ధం జరుగుతున్న సమయం లో ఆయుధాల తో ఒకవైపు యుద్ధం చేస్తూ ఉంటే మరోవైపు ఆయుధ రహితం గా ఆర్థిక యుద్ధం చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రెండు మాత్రమే కాకుండా అటు మీడియా కూడా ఒక వైపు నుంచి యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆయా దేశానికి సైనికుల్లో ఉత్తేజం నింపడానికి లేదా ప్రత్యర్థుల లో భయం నింపడానికి ఎప్పుడూ పత్రికలు చిత్ర విచిత్రమైన వార్తలను ప్రచురితం చేస్తూ ఉంటాయి.


 శత్రు దేశాల సేనలు కుప్పకూలి పోతున్నాయని.. ఆ దేశం పని అయి పోయినట్టే అంటూ వార్తలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యం లో ఇలాంటి వార్తలు ఎక్కువగా వైరల్ గా మారి పోతాయ్. ఒక్కరోజు మాత్రమే ఉక్రెయిన్ పై రష్య పైచేయి సాధించింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత నాటో యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించిన పత్రికలు అన్నీ కూడా ఉక్రెయిన్ రష్యాపై ఆధిపత్యం సాధిస్తుందని ఎంతో మంది సైనికులను హతమార్చింది యుద్ధ విమానాలను కూడా కూల్చేసింది అంటూ ఇక కథనాలు ప్రచురితం చేయడం మొదలు పెట్టాయి.



 ఇక ప్రస్తుతం యుద్ధం 10 వ రోజుకు చేరిన నేపథ్యం లో ఇప్పటికి కూడా ఉక్రెయిన్  విరోచితం గా పోరాడుతు రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నట్లు అంటూ వార్తలు వస్తున్నాయి   ఇలాంటి సమయం లో ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారి పోయింది. సిరియా లోని  నరరూప హంతకుల లాంటి  ఫైటర్స్ ను రష్యా ఇటీవల తన సైన్యంలో చేర్చుకుందట. ఇక ఈ సీరియన్ సైన్యం తో ఉక్రెయిన్లో ప్రజల పై దాడి చేసేందుకు రష్యా సిద్ధం అయింది అంటూ ప్రస్తుతం పాశ్చాత్య దేశాల మీడియా చెబుతోంది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: