నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురోయ్ అనే ఒక పాటలోని లిరిక్ మీకు గుర్తుండే ఉంటుంది.. నా దారి రహదారి డోంట్ కం ఇన్ మై వే అనే రజనీకాంత్ చెప్పిన డైలాగ్ కూడాఅందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ రెండు కూడా బాగా సరిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ అని చెప్పాలి. ఎందుకంటే నలుగురికి నచ్చినది అతనికి అస్సలు నచ్చదు. అందరూ ఒక రూట్లో వెళ్తూ ఉంటే అతనిది మాత్రం సపరేట్ రూట్. అందుకే అతను ఏం చేసినా కూడా అది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.


 ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా ప్రజాస్వామ్యం రాజ్య మేలుతూ ఉంటే.. ఉత్తర కొరియాలో మాత్రం ఇంకా బానిసత్వ పాలన కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఏకంగా ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ బానిసలుగా మార్చుకొని తనకు నచ్చినట్లుగా పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తూ ఉంటాడు కిమ్ జాంగ్. అందుకే అతన్ని అందరూ కూడా నియంత అని పిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అయితే యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా ఏకంగా తరచూ మిస్సైల్స్ ప్రయోగాలు చేపట్టి ఇక ప్రపంచవ్యాప్తంగా మరింత హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు కిమ్ జాంగ్. అయితే ఇక కిమ్ పాలన సాగిస్తున్న ఉత్తర కొరియాలో మాత్రం ఏకంగా లాక్ డౌన్ కొనసాగుతూ ఉండడం గమనార్హం. అదేంటి కరోనా వైరస్ ప్రభావం తగ్గింది కదా.. అక్కడ మళ్ళీ కేసులు పెరుగుతున్నాయా. ఎందుకు మళ్లీ లాక్ డౌన్ విధించారు అని తెలుసుకోవాలనుకున్నారు కదా. లాక్ డౌన్ విధించడానికి కరోనా వైరస్ కారణం కాదు సరిహద్దు నగరమైన హైసన్ లో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 10 వరకు సైనిక దళాల ఉపసంహరణ జరిగింది. ఆ సమయంలో 653 తూటాలు మిస్ అయ్యాయి. ఇక ఈ తూటాలు ఎక్కడున్నాయో దొరికినంత వరకు కూడా నగరంలో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు నియంత కిమ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kim