తుపాకీ లో ఉన్న బుల్లెట్ ఒక్కసారి గన్ నుంచి బయటికి వచ్చింది అంతే చాలు ముందు ఉన్న మనిషి శరీరాన్ని చీల్చుకుంటూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా ఒకసారి తుపాకి నుంచి బయటికి వచ్చిన బుల్లెట్ ను ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పాలి. కానీ అల్లరి నరేష్ మాత్రం ఇలా తుపాకీ నుంచి దూసుకు వచ్చిన బుల్లెట్ ను ఎంతో సులభంగా పంటితో పట్టుకొని పక్కకు ఉమ్మేయటం ఒక సినిమాలో చూసాం అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటివి అల్లరి నరేష్ సినిమాలో సాధ్యమవుతాయి కానీ నిజజీవితంలో ఇలాంటివి ట్రై చేస్తే ప్రాణాలు పోవడం ఖాయం అంటారు ప్రతి ఒక్కరు.


 అయితే కామెడీ కోసం అల్లరి నరేష్ సినిమాలో చేసి చూపించిన దాన్ని ఇక్కడ ఒక సైనికుడు మాత్రం నిజంగానే చేసి చూపించాడు. ఏకంగా నోటి దగ్గర గన్ పెట్టుకొని కాల్చుకొని మరి పంటితో ఏకంగా బుల్లెట్ ను పట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోవడంతో అతను నిజంగా మనిషేనా లేకపోతే ఇంకేమైనానా అనేది అర్థం కాక నేటిజన్స్  సైతం కన్ఫ్యూషన్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఏకంగా ఒక ఆఫ్రికన్ సైనికుడు తన నోటితో ఏకే 47 నుంచి కాల్చిన బుల్లెట్ ను పంటితో  పట్టుకొని అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.



 సైనికుడి దుస్తువుల్లో ఉన్న ఒక వ్యక్తి రైఫిల్ తో తన నోటికి దగ్గరగా కాల్పులు జరుపుతున్నాడు. ఇక కొన్ని సెకండ్ల తర్వాత ఆ వ్యక్తి బుల్లెట్ ను తన నోటిలో నుంచి ఉమ్మి వేస్తూ ఉన్నాడు. ఇలా రెండు మూడు రకాల తుపాకులతో కాల్చుకుని బుల్లెట్ ను ఎంతో ఈజీగా నోటితో పట్టి బయటికి ఉమ్మేసాడు. ఇక ఇలాంటి తుపాకులలో ఏకీ 47 కూడా ఉండడం గమనార్హం. దీంతో అతను ఇది ఎలా చేయగలుగుతున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక మరి కొంతమంది అది డమ్మీగన్ అందుకే అతను అలా చేయగలుగుతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: