నిద్ర అనేది ప్రతి మనిషి జీవితం లో ఎంతో కీలకమైనది అన్న విషయం తెలిసిందే. తగిన సమయం నిద్ర పోయినప్పుడే మనిషి ఆరోగ్యం ఎంతో పదిలం గా  ఉంటుందని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. ఇక ప్రతి మనిషి ప్రతి రోజు దాదాపు 8 గంటల పాటు నిద్రపోవాలని.. అలా అయితేనే ఎక్కువ కాలం పాటు ఆరోగ్యం గా బ్రతికేందుకు అవకాశం ఉంటుంది అంటూ ఉంటారు. లేదంటే నిద్రలేమి సమస్య తో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా చుట్టు ముట్టే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 దీంతో ప్రపంచం లో ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరు కూడా రాత్రి సమయం లో నిద్ర పోయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు.. అలసట నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందుకే ప్రతి మనిషి జీవితం లో నిద్ర అనేది ఒక భాగంగా మారి పోయింది. అయితే ఇక్కడ మాత్రం ఒక చిన్నారి విషయం లో నిద్ర అనేది శాపంగా మారి పోయింది అని చెప్పాలి. ఒకవేళ ఆ చిన్నారి పొరపాటున నిద్ర పోయింది అంటే చివరికి చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి.



 ఇలా నిద్రపోతే శ్వాస ఆగిపోయే అరుదైన వ్యాధితో బాధపడుతుంది ఆరేళ్ల చిన్నారి సాండి. యూకే కి చెందిన ఈ చిన్నారికి సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ వల్ల ఏకాగ్రత పెట్టిన లేదా నిద్రపోయిన మెదడు శ్వాస తీసుకోవడం మర్చిపోతుందట. దీంతో వైద్యులు చిన్నారి మెడకు రంధ్రం వేసి శ్వాసనాలం నుంచి మెదడుకు సంకేతాలు పంపే విధంగా ఒక పైప్ ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రతిరోజు 24 గంటలు కూతురుని కాపాడుకోవడమే ఆ తల్లిదండ్రుల నిత్య కృత్యంగా మారిపోయింది. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1000 వెలుగులోకి వచ్చాయని వైద్యులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: