ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలో అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. దీన్ని బట్టి చూస్తే ఇక ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోగలుగుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనల గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతూ ఉంటారు.


 సాధారణంగా సామాన్య ప్రజలు తమకు ఏదైనా వాహనం రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో అదృష్టవశాత్తు ఫ్యాన్సీ నెంబర్ వస్తే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. కానీ కాస్త డబ్బు ఉన్న వాళ్ళు  లక్షలు ధారపోసి అయినా సరే తమకు ఇష్టమైన ఫ్యాన్సీ నెంబర్ కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వరకు ఫ్యాన్సీ నెంబర్ కోసం కేవలం లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం మాత్రమే చూసాము. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తుంది. ఏకంగా ఫ్యాన్సీ నెంబర్ కోసం 122 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కాస్త ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.


 దుబాయిలో మోస్ట్ నోబుల్ నంబర్స్  వేలం లో ఒక కారు ఫ్యాన్సీ నెంబర్ ఏకంగా 55 మిలియన్ దిర్హం లు అంటే భారత కరెన్సీలో సుమారు 122 కోట్ల రూపాయలు పలికింది. పి7 అనే కారు నెంబర్ను ఫ్రెండ్స్ ఇమిరేట్ వ్యాపారవేత్త టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకులు అయినా పావెల్ వాలేరివోచ్ దురోవ్ కొనుగోలు చేశాడు. ఇకపోతే ఇలా ఫ్యాన్సీ నెంబర్ కోసం వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు సేవ చేయడం కోసం పనిచేస్తున్న వన్ బిలియన్ మీల్స్ కోసం ఖర్చు పెట్టమన్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: