సాధారణంగా డాక్టర్ల దగ్గరికి ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు వస్తూనే ఉంటారు. దీంతో ఎలాంటి పేషెంట్ ను చూసిన అటు డాక్టర్లకు కొత్తగా ఏమీ అనిపించదు. కానీ కొన్ని కొన్ని సార్లు ఏకంగా డాక్టర్లను సైతం అవాక్కయ్యేలా చేసే కొన్ని కేసులు వారి దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇలాంటివి చూసి డాక్టర్లు సైతం అవాక్కవ్వడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. చైనాలో డాక్టర్లకు ఒక వింత సంఘటన ఎదురయింది. చెవి నొప్పి ఉంది అంటూ ఒక మహిళ డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది.



 అయితే అది అందరికీ వచ్చే సాధారణమైన చెవి నొప్పి అని డాక్టర్లు అనుకున్నారు. అందరికీ చేసినట్లుగానే పరీక్షలు చేశారు. కానీ పరీక్షల్లో బయటపడ్డ నిజం గురించి తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి. ఎందుకంటే సదరు మహిళ చెవిలో ఒక సాలీడు గూడు కట్టుకుని ఒక కుటుంబాన్ని కూడా పెంచుకుంటుంది. ఇక ఈ విషయం తెలిసి డాక్టర్లు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. సిచువాన్ ప్రావిన్స్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డాక్టర్ మహిళా చెవిని ఎండోస్కోపీ చేస్తున్న సమయంలో చెవిలో ఒక సాలీడు గూడు కట్టుకుంది అన్న విషయం స్పష్టంగా కనిపించింది..



 అయితే ముందుగా సాలీడు కట్టుకున్న గూడుని కర్ణభేరి అనుకున్నారు డాక్టర్లు. కానీ ఆ తర్వాత అది కర్ణభేరి కాదు అన్న విషయంపై ఒక క్లారిటీ కి వచ్చారు. ఈ క్రమంలోనే కెమెరాతో అమర్చిన ఒక ప్రత్యేకమైన పరికరాన్ని మహిళ చెవిపై ఎండోస్కోపీ నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాలీడు అల్లిన ఒక గూడుని తొలిచిన తర్వాత దాని వెనుక ఒక సాలే పురుగు కుటుంబమే నివాసం ఉంటుంది అన్న విషయం బయటపడింది. అంతేకాదు పరీక్ష చేస్తున్న సమయంలో ఎండోస్కోపీ ట్యూబ్ పై సాలీడు దాడి కూడా చేయడం గమనార్హం. అయితే సాలీడును బయటకు తీసే సమయంలో అది పారిపోయేందుకు ప్రయత్నించిందని తర్వాత సజావుగా దాన్ని చెవి నుంచి బయటకు తీసినట్లు డాక్టర్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: