ప్రతి మనిషి జీవితంలో దగ్గు తుమ్ము అనేది చాలా కామన్. ఇలా దగ్గకుండా తుమ్మకుండా ఉండే మనిషి ఎవరు ఉండరు అనడంలోనూ సందేహం లేదు. ఏదో ఒక సందర్భంలో తప్పకుండా తగ్గు తూమ్ము వస్తూ ఉంటుంది అని చెప్పాలి. కానీ దగ్గటం కారణంగా ఏకంగా జైలు శిక్ష పడటం గురించి ఎప్పుడైనా విన్నారా? ఊరుకోండి బాసు దగ్గితే జైలు శిక్ష పడుతుంది దగ్గితే అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక జైలు శిక్ష పడాల్సిందే  ఎందుకంటే దగ్గకుండా తుమ్మకుంట ఎవరు ఉంటారు చెప్పండి అని అంటారు ఎవరైనా కానీ ఇక్కడ మాత్రం ఇలాగే జరిగింది ఏకంగా తగ్గినందుకు అతనికి జైలు శిక్ష పడింది.


 అది కూడా రెండు వారాలపాటు. ఈ ఘటన కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం దగ్గినా తుమ్మినా పెద్దగా ఎవరూ పట్టించుకోవటలేదు. కానీ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ఎవరైనా పక్కనున్న వాళ్లు తుమ్మడం కానీ దగ్గడం కానీ చేశారు అంటే చాలు అందరూ భయపడిపోయేవారు. వారికి దూరంగా జరిగే వారు కొంతమంది ఎవరు ఏమనుకుంటారు అని భావించి ఇక బహిరంగ ప్రదేశాలలో తుమ్మడం దగ్గడం కూడా ఆపుకున్న  సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఏకంగా దగ్గితే జైలు శిక్ష పడింది అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.



 కరోనా టైంలో బహిరంగ ప్రదేశంలో దక్కిన భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్టు రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక కంపెనీలో క్లీనర్ గా పనిచేస్తున్న తమిళ్ సెల్వం అనే 64 ఏళ్ల వ్యక్తి 2021 అక్టోబర్ 18 వ తేదీన వైరస్ సోకడంతో ఇంటికి వెళ్లాలని కంపెనీ యాజమాన్యం తెలిపింది. కానీ అతను మాత్రం నిర్లక్ష్యంగా ఇంటికి వెళ్లి జాగ్రత్తలు తీసుకోకుండా కంపెనీ పరిసరాలలో దగ్గుతూ తిరుగుతూ ఉండేవాడు. దీంతో మరో ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. అయితే కరోనాను అతని నిర్లక్ష్యం చేశాడు అని నిరూపితం కావడంతో రెండు వారాల జైలు శిక్ష విధించింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: