ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకు వస్తుంది అన్నది ముందుగా ఊహించడం చాలా కష్టం. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అప్రమత్తంగా ఉన్నప్పటికీ ప్రమాదం చివరికి దరి చేరుతూ ఉంటుంది. కానీ ఇంకొన్నిసార్లు మాత్రం అప్రమత్తంగా ఉంటే చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది  ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి.


 ఇటీవల కాలంలో పాశ్చాత్య దేశాల్లో గన్ కల్చర్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా చోరీలకు పాల్పడేందుకు సైతం కొంతమంది తమ వెంట గన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చివరికి అడ్డు వచ్చిన వారిని కాల్చివేసి దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియో కూడా ఇలాంటి కొవలోకి చెందినదే అని చెప్పాలి. ఏకంగా నార్త్ కరోలినోలో జరిగిన ఘటన ఏకంగా నేటిజన్స్ అందరిని కూడా అవాక్కయ్యేలా చేస్తుంది.


 బస్సులో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ ఇక బస్సును నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలోనే ఒక దొంగ తన వెంట తుపాకీ తీసుకొని ఏకంగా బస్సును హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బస్సు డ్రైవర్ దగ్గరకు వెళ్లి గన్ పట్టుకుని బెదిరించడానికి ట్రై చేశాడు. అయితే అంతలో బస్ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. ఏకంగా తన దగ్గర ఉన్న తుపాకీ తీసి ఆ దొంగ పై కాల్పులు జరిపాడు బస్సు డ్రైవర్. అయితే ఇక వెనకాల బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండడంతో అది మాత్రమే  పగిలింది. ఇక దొంగకి ఎలాంటి బుల్లెట్లు తగలేదు. అందువల్ల అతను వెంటనే కింద పడిపోయి బస్సు పైనుంచి పాకుతూ ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నించాడు. ఇక ఈ వీడియో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: