అఖిలేశ్‌ కు గవర్నర్ షాక్.. రేప్‌ మంత్రి ఎందుకు..?


అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ సమాజ్‌వాది పార్టీ నేత గాయత్రి ప్రజాపతి ఇంకా మీ కేబినెట్‌లో ఎందుకని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్‌ రామ్‌ నాయక్‌ లేఖ రాశారు.ఇప్పటికీ ఆయనను ఎందుకు కేబినెట్‌లో కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తూ వివరణ కోరారు. దీనికి సంబంధించి వివరణ కోరుతూ ఆయన అఖిలేశ్‌ కు లేఖ పంపించినట్లు కూడా రాజ్‌భవన్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.


ఊర్జిత్ పటేల్ కు బెదిరింపు లేఖ.. 

urjit patel కోసం చిత్ర ఫలితం
ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు ఓ వ్యక్తి చంపుతానని బెదిరిస్తూ ఈ మెయిల్ పంపాడు. ఈమెయిల్ కలకలాన్ని రేపింది. ఆర్ బి ఐ గవర్నర్ పదవి నుండి తప్పుకోవాలని చంపేస్తామంటూ ఆగంతకుడు ఉర్జిత్ పటేల్ కు లేఖ రాశాడు. ఆర్ బి ఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ నిర్ణయాన్ని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శించాయి.


ప్రాణాలు తీసిన జల్లికట్టు...


తమిళనాడులోని ఓ ప్రాంతంలో నిర్వహించిన జల్లికట్టు విషాదంగా మారింది. ఇందులో పాల్గొన్న వ్యక్తులను ఎద్దు కుమ్మేయడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 56మంది గాయాలపాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం తిరువప్పూర్‌ జిల్లాలో ఆదివారం నేపథ్యంలో ఆటవిడుపుగా జల్లికట్టు నిర్వహించారు. అదే సమయంలో ఇక్కడ ఉన్న ఆలయంలో ఉత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు.


సిక్కు వ్యక్తిపై అమెరికాలో కాల్పులు...

GUN FIRE కోసం చిత్ర ఫలితం

అమెరికాలోని సియాటెల్‌లో ఓ సిక్కు వ్యక్తి పైన కాల్పులు జరిగాయి. అతను ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కాల్పులు జరిపే ముందు.. నీ దేశానికి నువ్వు వెళ్లిపో అని కాల్చిన వ్యక్తి హెచ్చరికలు జారీ చేశాడు. అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు టెక్కీ శ్రీనివాస్‌ కూచిభోట్ల మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా దాడులు కొనసాగుతున్నాయి.


ట్రంప్ వ్యాఖ్యల వల్లే దాడులు చేస్తున్నారు...


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ విద్వేషపూరిత వ్యాఖ్యల వల్లే భారతీయులపై దాడులు జరుగుతున్నాయని, శ్వేతజాతి దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ దీప్ రాయ్ తండ్రి సర్దార్ హర్‌పాల్ సింగ్ అన్నారు. తన కొడుకు చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని, ఆస్ప్రతిలో కోలుకుంటున్నాడని, ప్రాణాపాయం తప్పిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మ స్వరాజ్కు చెప్పారు. సుష్మ స్వరాజ్ ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
  



మరింత సమాచారం తెలుసుకోండి: