
ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ లో ఎన్నో గొప్ప గొప్ప పదవులు మోసి చివరికు ఎటు కాకుండా పోయినాడని చెప్పాలి. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ పాతాళానికీ పోయింది. దానితో ఆ పార్టీ లో ఉన్న కొంత మంది నాయకులూ కూడా పార్టీ లు మారి తమ రాజకీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. అయితే ఆనం ఇప్పటి వరకు టీడీపీ లో ఉన్న పార్టీ లో తగినంత గౌరవం రాలేదని పార్టీ మారడానికి సిద్ధం అయిపోయాడు.
పార్టీలో చేరబోయే వేళ మళ్లీ మిత్రత్వానికి బాటలు వేయాలని అనుకున్నారు. పార్టీలో చేరడానికి ముహూర్తం నిర్ణయించుకోగానే వైకాపా నేతలను కలుసుకున్నారు. ఎంపీ మేకపాటి రాజ్‌మోహన్ రెడ్డిని, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డిని కలుసుకున్నారు. మిగతావారికంటే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ను కలుసుకోవడం విశేషం. ఎందుకంటే.. 2009 నుంచి ఈయనకు, ఆనం రామనారాయణ రెడ్డికి మాటలు లేకపోవడమే కాకుండా కనీసం ఒకరినొకరు చూసుకోవడంలేదు కూడా.
వచ్చే ఎన్నికల్లోనూ అతనే పోటీ చేస్తాడు కాబట్టి ఈయన్ని వెంకటగిరి నుంచి పోటీ చేయాలని చెప్పారు. వైకాపా అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మంత్రిపదవి ఇవ్వాలని కోరారు. కాని జగన్ ఆ విషయంలో హామీ ఇవ్వలేదు. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత రీతిలో గౌరవిస్తానని జగన్ హామీ ఇవ్వడంతో ఆత్మకూరు దక్కకపోయినా, మంత్రి పదవిపై హామీ లేకపోయినా రాజీపడిపోయి వైకాపాలో చేరాలని డిసైడైపోయారు.