షాద్నగర్ వైద్యురాలు దిశా  అత్యాచారం హత్య నిందితుల ఎన్కౌంటర్పై విచారణ కొనసాగుతోంది. దిశ అత్యాచారం హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కొంతమంది దిశ కేసులో నలుగురు నిందితులు ఎన్కౌంటర్ ను  సమర్థిస్తూ ఉంటే ఇంకొంతమంది చట్టవిరుద్ధంగా ఎన్కౌంటర్ చేశారు అంటూ ఎన్ కౌంటర్ ను వ్యతిరేకిస్తున్నారు. అయితే దిశా  నిందితుల ఎన్కౌంటర్ జరిగి ఇప్పటికే 16 రోజులు అయినప్పటికీ ఇప్పటికీ మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించి లేదు. ఎన్కౌంటర్ ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాము  నియమించిన కమిటీ దిశా  నిందితుల ఎన్కౌంటర్పై విచారణ జరిపేంతవరకు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించింది. ఇక తాజాగా హైకోర్టు కూడా నిందితుల మృతదేహాలను రీ  పోస్టుమార్టం చేయించాలని హైకోర్టు భావిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. 

 

 

 

 ఇకపోతే  దిశ అత్యాచార నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య తన  భర్త ఎన్కౌంటర్పై నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. తన భర్త తనకు కాకుండా చేసినందుకు  50 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు చెన్నకేశవులు భార్య. అయితే తాజాగా నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు... నిన్న నిందితుడు చెన్నకేశవులు  గ్రామం లో జరిపిన ప్రాథమిక విచారణలో చెన్నకేశవులు భార్య మైనర్ అని తేలింది. చెన్నకేశవులు భార్య చదువుకున్న పాఠశాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా బాధితురాలి వయస్సు పదమూడు సంవత్సరాల ఆరు నెలలట . అయితే చెన్నకేశవులు  తల్లిదండ్రులతో మాట్లాడిన అధికారులు.. భార్య మైనర్ కావడంతో బాలసదన్ లో  ఆమెకు ఆశ్రయం కల్పిస్తామని  చెప్పారు.కాని దీనికి  చెన్నకేశవులు తల్లిదండ్రులు అంగీకరించలేదు. చెన్నకేశవులు భార్య ఆరు నెలల గర్భిణి అని.. బాలాసాదన్ కు పంపబోమని  తేల్చి చెప్పారు. 

 

 

 అయితే ప్రస్తుతం బాబాయి ఇంట్లో ఉంటున్న చెన్నకేశవులు భార్య చెల్లెలు తమ్ముడైన పంపించాలని కోరగా... బాధితురాలు చెన్నకేశవులు భార్య చెల్లెలు తమ వద్దే ఉంటుందని కావాలంటే ఆమె తమ్మున్ని  బాలల సంరక్షణ కేంద్రానికి పంపిస్తామని అతడి బాబాయ్ అధికారులకు వెల్లడించారు. అయితే బాధిత బాలిక తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో.. అప్పటినుంచి బాబాయి నాయనమ్మ వద్దే ఉంటున్నారు ఈ ముగ్గురు. చెన్నకేశవులు ప్రేమించి పెళ్లాడిన తర్వాత ఆ బాలిక అత్తారింటికి వచ్చింది. అయితే ఆమె తమ్ముడు చెల్లెలు మాత్రం ఇంకా బాబా ఇంట్లోనే ఉంటున్నారు. ఇకపోతే తాము తయారుచేసిన ప్రాథమిక నివేదికను... అధికారులకు పంపిస్తామని బాలల సంరక్షణ విభాగం అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: