
కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి ఉంటున్నా కూడా కరోనా ప్రభావం మాత్రం తగ్గడం లేదు. ప్రపంచంలో దీని వలన మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నది. ఆరు ఖండాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా వలన కలిగే అనర్ధాలు ఏంటి ఎలా వస్తున్నది అని కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, అన్నింటికంటే క్లిష్టమైన సమస్య ఏమంటే ఇప్పటి వరకు దీనికి మందు లేకపోవడం.
దీనికి టీకా తయారు చేయాలంటే కనీసం ఏడాది సమయం పడుతుందని అంటున్నారు. అంతేకాదు, ఇది సీజనల్ వ్యాధిగా కూడా మారిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సీజనల్ వ్యాధిగా మారకుండా ఉండాలి అంటే ఏం చేయాలి. ఎలా దీనిని అరికట్టాలి అని ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. వచ్చిన తరువాత ఏమి చేయలేమని, రాకుండా ముందు జాగ్రత్త చర్యలు మాత్రమే తీసుకోగలమని అంటున్నారు.
శుభ్రతను తప్పనిసరిగా పాటించాలి. అలా పాటిస్తేనే అందరికి ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకైతే ఆంధ్రప్రదేశ్ లో 13 అనుమానిత కేసులను గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే, ఒక్కరికి కూడా పాజిటివ్ కేసు వచ్చినట్టు లేదని అంటున్నారు. ప్రస్తుతం శాంపిల్స్ ను తిరుపతి, హైదరాబాద్ లోని గాంధీ, పూణే లోనే వైరాలజి ల్యాబ్ లకు పించినట్టు అధికారులు చెప్తున్నారు.
అక్కడి నుంచి వచ్చే రిజల్ట్ ను బట్టి అనుమానిత కేసులను పరిష్కరిస్తామని అధికారులు చెప్తున్నారు. విశాఖలో ఐదు అనుమానిత కేసులు రాయడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇటీవలే మలేషియా, సింగపూర్ వెళ్లి వచ్చారు. అలానే మరో ఇద్దరు సౌదీ నుంచి వచ్చారు. వీరంతా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ విశాఖ ఛాతి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.