సినీ ఇండస్ట్రీలో రోజుకొక కొత్త హీరోయిన్ పరిచయమవుతూ ఉంటారు. వారిలో కొందరు అందం అభినయంతో గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకోగా.. మరికొందరు ఆ ఒక్క సినిమాతోనే సరిపెట్టుకొని తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోతుంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు బ్యూటీతో పాటు తమ యాక్టింగ్ కలిపి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేల్ డామినేషన్ ఉండే సినీ ఇండస్ట్రీలో హీరోలు శాశ్వితంగా ఉంటారేమో.. హీరోయిన్స్ మాత్రం ఏదొక రోజు ఇంటికి వెళ్లిపోవాల్సిందే అనే సత్యం అందరికి తెలిసిందే. కొంతమంది హీరోయిన్స్ కొన్ని రోజులు స్టార్ హీరోయిన్ గా వెలుగొందినప్పటికీ ఒక్క సినిమా ప్లాప్ అయితే కిందికి దించేస్తారు మన ఇండస్ట్రీ వాళ్ళు. అంతేకాకుండా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా కొంతమంది హీరోయిన్లు దుకాణం సర్దేసే టైం కూడా వస్తుంటుంది. ఎందుకంటే 'కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోవాల్సిందేగా'.. మన సినీ ఇండస్ట్రీలో విషయంలో కూడా సినిమా హిట్ కొట్టినా ఫ్లాప్ అయినా కొత్త అందాల రాక‌తో ఇక పాత అందాలు స‌ర్ధుకోవాల్సిందే. స్టార్ హీరోయిన్ గా ఎదిగినవారు సైతం గెస్ట్ అప్పీరియన్స్ కే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మన 'కుమారి' హెబ్బా పటేల్ పరిస్థితి కూడా అంతే అని చెప్పుకోవాలి.

 

'కుమారి 21ఎఫ్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే అందరూ తనవైపు చూసేలా చేసుకుంది. కానీ క్రేజీ ఆఫర్స్ మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ గెస్ట్ రోల్స్ చేస్తూ బండి ఈడుస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా చేస్తున్న ‘రెడ్’ సినిమాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ఐటమ్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో హెబ్బా కనిపించనుంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం హెబ్బా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ తో పాటు గెస్ట్ రోల్ లో కూడా నటిస్తోందట. కేవలం రెండు సీన్స్ లో మాత్రమే హబ్బా పాత్ర ఉన్నప్పటికీ అవి చాల కీలమైన సీన్స్ అని తెలుస్తోంది. 'భీష్మ' సినిమాలో కూడా హెబ్బా గెస్ట్ రోల్ చేసింది. మళ్ళీ రెడ్ సినిమాలో కూడా గెస్ట్ రోల్ లో నటిస్తోంది. మొత్తానికి హీరోయిన్ క్యారెక్టర్స్ కే ఫిక్స్ కాకుండా సైడ్ క్యారెక్టర్స్ అండ్ స్పెషల్ సాంగ్స్ తో హెబ్బా మెరుస్తోంది. మరి ఇలాంటి క్యారెక్టర్లతో హెబ్బా ఎన్ని రోజులు ఇండస్ట్రీలో నెగ్గుకురాగలదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: