స‌రిహ‌ద్దుల్లో మ‌నతో క‌య్యం పెట్టుకుంటున్న చైనాకు షాక్ ఇచ్చే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అవుతున్నాయి. ఫ్రాన్స్ నుంచి భారత్ 36 రాఫెల్స్‌ను కోనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తొలి విడతగా ఐదు రాఫెల్స్ జూలై 29న హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌కు చేరుకున్నాయి. అనంత‌రం భారత వాయుసేనలోని గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లోకి ఇటీవల కొత్తగా చేరిన అత్యాధునిక ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు రాత్రి వేళ లడక్ సరిహద్దుపై నిఘా పెడుతున్నాయి. అత్యాధునిక బాంబులు కలిగిన ఇవి హిమాచల్ ప్రదేశ్‌లోని గగన తలం నుంచి పూర్తిస్థాయి విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. లడఖ్‌‌లోని చైనా సరిహద్దులో 1,597 కిలోమీటర్ల మేర విస్తరించిన వాస్తవాధీన రేఖపై కన్నేసి ఉంచాయి.


చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్‌లోని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదికలను నిశితంగా గమనిస్తున్నాయి. ఆ దేశ రాడర్ల సిగ్నల్స్‌ను గుర్తిస్తున్నాయి. ప్రతికూల సమయంలో ఆ సిగ్నల్స్‌ను జామ్ చేసి మెరుపుదాడులు చేసే విన్యాసాలను చేపడతున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ ప‌రిణామం ఖ‌చ్చితంగా పాక్‌కు షాక్ ఇచ్చేవ‌ని పేర్కొంటున్నారు.



ఇదిలాఉండ‌గా, పర్వ‌తా‌లతో అత్యంత దుర్బే‌ధ్యంగా ఉండే టిబెట్‌ ప్రాంతాల్లో కూడా రాఫెల్‌ సాయంతో భారత వైమా‌నిక దళం (ఐ‌ఏ‌ఎఫ్‌) శత్రు‌వు‌లపై పైచేయి సాధిం‌చ‌వ‌చ్చు. చైనా వంటి దేశా‌లతో వ్యూహా‌త్మక వైమా‌నిక యుద్ధ పోరా‌టా‌లకు ఈ విమా‌నాలు చక్కగా సరి‌పో‌తాయి. శత్రు‌వుల స్థావ‌రా‌లను, విమా‌నా‌లను ధ్వంసం చేయ‌డా‌నికి భూతలం నుంచి గగ‌న‌త‌లం‌లోకి క్షిపణి ప్రయో‌గా‌లకు రాఫెల్‌ జెట్లు సాయ‌ప‌డు‌తా‌యి. రాఫె‌ల్‌తో పాటు ఎస్‌–400 క్షిపణి వ్యవ‌స్థను కలిగి ఉండటం వల్ల భార‌త్‌పై యుద్ధం ప్రక‌టిం‌చ‌డా‌నికి శత్రు‌దే‌శాలు ఒక‌టికి రెండు‌సార్లు ఆలో‌చి‌స్తాయి. రాఫెల్‌, ఎస్‌–400 క్షిపణి వ్యవస్థ సాయంతో పాకి‌స్థా‌న్‌కు చెందిన విమా‌నా‌లను భారత గగ‌న‌త‌లం‌లోకి ప్రవే‌శిం‌చే‌కంటే ముందే ధ్వంసం చేయ‌వ‌చ్చు. ఇదిలాఉండ‌గా,  మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో 18ని అంబాలా ఎయిర్‌బేస్‌లో, మరో 18ని భూటాన్ సరిహద్దులోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: