ప్ర‌జ‌ల కోసం చ‌ట్టాలు స‌వ‌ర‌ణ చేయ‌డం చూస్తుంటాం. కానీ నాయ‌కుల కోసం చ‌ట్టాలు మార్చ‌డం? అందులోనూ దేశ ప్ర‌జ‌లంతా క‌లిసి చ‌ట్టాన్ని ఒక నాయ‌కుడి కోసం మార్చ‌డం...అందులోనూ ప్ర‌స్తుత కాలంలో...నిజంగా అద్భుతం క‌దా? అలాంటి అద్భుతానికి వేదికగా నిలిచింది ర‌ష్యా. ఆ అవ‌కాశం సొంతం చేసుకుంది ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌. ప్ర‌పంచం అంతా ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న కరోనా వైరస్‌కు మిగ‌తా దేశాల కంటే ముందే వ్యాక్సిన్ రిలీజ్ చేయ‌డం ద్వారా ర‌ష్యా వార్త‌ల్లో నిలిచింది. ఆ దేశ అధ్య‌క్షుడు పుతిన్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.


అయితే, ఇదొక్క‌టే పుతిన్ ప్ర‌త్యేక‌త కాఉద‌. ఆయ‌న గురించి తెలుసుకోవాల్సిన విష‌యాలు ఎన్నో ఉన్నాయి. రష్యా అధ్యక్షుడిగా మే 7 2000 సంవత్సరంలో  పుతిన్  బాధ్యతలు చేపట్టారు. 2000 నుంచి 2008 వరకు రెండుసార్లు రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పుతిన్ 2008 నుంచి 2012 వరకు ప్రధానిగా పనిచేశారు. తిరిగి 2012లో పుతిన్ ను రష్యా అధ్యక్షుడిగా ప్రజలు ఎన్నుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న అధ్య‌క్షుడిగా ఉండ‌గా.. పదవీకాలం 2024లో ముగియనుంది. ఇక్క‌డితోనే ఆయ‌న ప్ర‌త్యేక‌త‌లు ఆగిపోలేదు. ఇటీవలే పుతిన్ కోసం రాజ్యాంగాన్ని సైతం మార్చి రాశారు. ఔను ఏకంగా 16 ఏళ్ల పాటు ఆదేశ అధ్య‌క్షుడిగా పుతిన్‌ కొన‌సాగేలా రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేశారు. ఈ రాజ్యాంగ సంస్కరణలకు రష్యా ప్రజల ఆమోదం ల‌భించింది.



పుతిన్ కోసం రాజ్యాంగ స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ ఆషామాషీగా ఏం జ‌ర‌గ‌లేదు. వారం రోజులపాటు ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ ఎన్నికలు నిర్వహించారు. 60 శాతం మంది ప్ర‌జ‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌కు అనుకూలంగా  76.9 శాతం మంది ఓటు వేశారని రష్యా కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌క‌టించింది. దీంతో.. సుదీర్ఘ కాలం పాటు ర‌ష్యా అధ్య‌క్షుడిగా కొన‌సాగ‌నున్నారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌తో పుతిన్ 2036 వ‌ర‌కు ర‌ష్యా అధ్య‌క్షుడి ప‌ద‌విలో కొన‌సాగుతారు పుతిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: