దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ దేశంలో 60,000కు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మందులు, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మహమ్మారిని పూర్తిస్థాయిలో కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రష్యా కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేయగా ఆ వ్యాక్సిన్ పనితీరు గురించి అనేక సందేహాలు నెలకొన్నాయి.
 
మరోవైపు కొన్ని రకాల మందులు కరోనా మహమ్మారి విషయంలో ఆశాజనకమైన ఫలితాలను కనబరుస్తున్నాయి. తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు హై బీపీ కోసం వాడే మందు కరోనాపై అద్భుతంగా పని చేస్తున్నాయని తేల్చారు. ఈ మందులు వాడిన వారిలో కరోనా మరణం ముప్పు ఏకంగా 33 శాతానికి తగ్గిందని తేలింది. యాంజియోటెన్సిన్ రిసెపర్టర్ బ్లాకర్స్ (ఏఆర్‌బీ), యాంజియోటెన్సిన్- కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ) మందులు కరోనా మరణం ముప్పును తగ్గిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
 
యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఎంజిలా పరిశోధకులు 28,872 మంది రోగులపై అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటికే వీటిని వినియోగిస్తున్న వారిలో మంచి ఫలితాలు కనిపిస్తున్న నేపథ్యంలో హై బీపీ లేని వారు ఈ ఔషధాలను సైతం వేసుకోవచ్చా...? లేదా...? అనే విషయం గురించి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. ఏసీఈ, ఏఆర్‌బీ మందులు డయాబెటిస్, కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్న వాళ్లలో కరోనా తీవ్రతను తగ్గిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
 
పరిశోధకులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వాళ్లు ఇప్పటికే ఈ మందులను వాడుతుంటే వారిపై కరోనా ప్రభావం తక్కువగా ఉందని తేలిందని తెలిపారు. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 61,408 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 836 మంది వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 31,06,348కు చేరగా మరణాల సంఖ్య 57,542కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 23.4 శాతంగా ఉండగా మరణాల రేటు 1.86 శాతంగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: