సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి దేశంలో అన్ లాక్ 4.0 ప్రక్రియ కొనసాగుతోంది.  ఇటీవలే కేంద్రం మార్గదర్శకాలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ అన్ లాక్ లో లాక్ డౌన్ లు విధించకూడదు అని చెప్పి ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది.  కంటైన్మెంట్ జోన్లు తప్పించి మిగతా ప్రాంతాల్లో ఎక్కడా కూడా లాక్ డౌన్ పెట్టొద్దని కేంద్రం గట్టిగా చెప్పింది. మొన్నటి వరకు తమిళనాడులో ప్రతి ఆదివారం ఒక్కో నగరంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తు వచ్చేవారు.  

కానీ, ఇకపై అక్కడ ఎలాంటి లాక్ డౌన్ ఉండబోవడం లేదు.  అయితే, బెంగాల్ లో దీనికి విరుద్ధంగా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది.  సెప్టెంబర్ 7, 11,12 తేదీల్లో బెంగాల్ లో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నారు.  కేంద్రం వద్దని చెప్పినప్పటికీ బెంగాల్ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటూ లాక్ డౌన్ విధించేందుకు మొగ్గు చూపింది.  

లాక్ డౌన్ విధించడం వెనుక కారణాలను కూడా ప్రభుత్వం పేర్కొన్నది.  కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల కంటే ముందే ఆ మూడు తేదీల్లో లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దాని అమలు కట్టుబడి ఉంటామని ప్రభుత్వ సిఎస్ పేర్కొన్నారు.కేంద్రం వద్దని చెప్పడం మామూలే, దానికి వ్యతిరేకంగా మమత నిర్ణయాలు తీసుకోవడం షరా మామూలే.  కేంద్రానికి, మమతకు అస్సలు పడదు.  

ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.  పైగా బెంగాల్లో బీజేపీ మెల్లిగా పుంజుకుంటోంది.  2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని 18 ఎంపీ స్థానాలు గెలుచుకుంది.  దీంతో మమత సర్కార్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి.  ఎర్రకోటను  బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన మమత గత పదేళ్లుగా బెంగాల్ లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగింది.  ఇప్పుడు బీజేపీ గట్టి పోటీ ఇస్తుండటంతో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను మమత వ్యతిరేకిస్తోందని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: