ప్రతి సంవత్సరం సంక్రాంతికి టాప్ హీరోల సినిమాల మధ్య పోటీ విపరీతంగా ఉండే పరిస్థితులలో సంక్రాంతి రేస్ విజేత ఎవరు అనే ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో విపరీతంగా ఉండేది. అయితే ఈసారి కరోనా పరిస్థితుల నేపధ్యంలో టాప్ హీరోల సినిమాలు ఏమీ విడుదల కావడంలేదు.


ఈసారి సంక్రాంతి రేస్ లో రామ్ రవితేజ బెల్లంకొండ శ్రీను లు మాత్రమే ఉన్నారు. వీరి ముగ్గురులో ఏ ఒక్కరు సంక్రాంతి రేస్ విజేత అయినప్పటికీ పెద్దగా ఎవరు పట్టించుకోరు. దీనితో ఇండస్ట్రీ దృష్టి అంతా సమ్మర్ రేస్ పైనే ఉంది. అయితే ఈసారి సమ్మర్ రేస్ కు 12 వారాలలో 12 పెద్ద సినిమాలు ఒకదానిపై ఒకటి పోటీగా విడుదల అవుతున్న పరిస్థితులలో ఈసారి రాబోయే సమ్మర్ రేస్ చాల టఫ్ గా ఉంటుంది అన్న అంచనాలు వస్తున్నాయి.


పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే ఏప్రిల్ పస్ట్ వీక్ కు రావాలని ఫిక్స్ అయింది అన్నవార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ‘రాథే శ్యామ్’ ను కూడా ఏప్రిల్ ఆఖరు వారంలో విడుదల చేస్తారని టాక్. అలాగే. బాలయ్య బోయపాటిల మూవీని త్వరగా షూట్ చేసి ఆ మూవీని కూడ సంక్రాంతి రేస్ లో దింపుతారని అంటున్నారు.


ఇక ‘వెంకీ నారప్ప’ కూడ సమ్మర్ రేస్ ను టార్గెట్ చేయబోతోంది. రానా ‘విరాటపర్వం’ కూడ సమ్మర్ క్యూలో ఉంది. నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండల లేటెస్ట్ మూవీ కూడ వేగంగా షూటింగ్ పూర్తిచేసి సమ్మర్ రేస్ కు రావాలని అనుకుంటోంది. అదేవిధంగా నాని లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ కూడ సమ్మర్ రేస్ పై కన్నేసిది. ఇవి కాకుండా ఇంకా చాల చిన్న సినిమాలు కూడ సమ్మర్ రేస్ పై కన్నెసాయి. ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు 12 వారాలు అనుకుంటే 12 సినిమాలు పక్కాగా రెడీ అయిపోతున్నాయి. ఈ పరిస్థితులలో రాబోయే సమ్మర్ రేస్ కూడ హీరోలకు అదేవిధంగా నిర్మాతలకు ఈ విపరీతమైన పోటీతో పెద్దగా కలిసి వచ్చేది లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: