ఏపీలో ఉక్కు ఉద్యమం రాజుకుంటున్న సమయంలో మీడియా పక్షపాతవైఖరి అవలంభిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యేకించి పక్షపాతం అన్నది కొత్త విషయం కాకపోయినా.. విశాఖ ఉక్కును టీడీపీకి అనుకూలంగా మలిచేందుకు రెండు పత్రికలు ప్రయత్నిస్తున్నాయని వైసీపీ విమర్శిస్తోంది. ప్రత్యేకించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలను రెండు పత్రికలు వక్రీకరించాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ అంశంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రెండు పత్రికలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.." నిర్మల సీతారామన్‌ అన్న అంశాలపై ఆ రెండు పత్రికలు వక్రీకరించి రాశాయి. తల నిండా రామోజీ రావు, రాధాకృష్ణకు విషపు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వైయస జగన్‌పై విషపూరితంగా వార్త కథనాలు రాశారు. వీటిపై టీవీల్లో చర్చోపచర్చలు పెడుతున్నారు. రాజకీయ పక్షాలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాయి. ఇలాంటి సమయంలో స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు అండగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే వాళ్లకు మద్దతుగా నిలిచింది. ఇటీవల రాష్ట్ర బంద్‌కు కూడా సంఘీభావం తెలిపామన్నారు సజ్జల.

ఆయన ఇంకా ఏమన్నారంటే.." వేరే మార్గం లేని చోట ప్రతిపక్షాలు చెప్పినవి ఆచరించవచ్చు కానీ. స్టీల్‌ ప్లాంట్‌ను నిలబెట్టడానికి అందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. చాలెంజ్‌లు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పటికైనా తప్పుడు రాతలు మానుకోకపోతే.. రాష్ట్రంలో ఇలాంటి పత్రికలు ఉండటం దౌర్భాగ్యమనుకోవాలి. పత్రికాధినేతలుగా ఆ ఇద్దరు పనికి రారు అని ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. చంద్రబాబుకు స్టీల్‌ ప్లాంట్‌ కొనే శక్తి ఉంది. ఆయనను కొనమని సలహా కూడా ఇస్తున్నాం. టీడీపీ నేతలు, రాష్ట్ర ప్రజలు కూడా ఇదే డిమాండు చేయాలని సజ్జల సూచించారు.

మా ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ఇచ్చిన వివరణను రాజకీయం చేయాలని కొన్ని పార్టీలు, శక్తులు ప్రయత్నం చేశాయంటున్నారు సజ్జల. దానికి తగినట్లే ఎల్లో మీడియాలో పిచ్చి రాతలు రాశాయని.. తప్పుడు రాతలకు సంబంధం లేకుండా నిర్మాల సీతారామన్‌కు స్పష్టంగా వంద శాతం పెట్టుబడులు అమ్మాలని కేంద్రం నిర్ణయం తీసుకన్నుట్లు చెప్పడంతో..ప్రధాని నరేంద్రమోదీకి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: