కరోనా వైరస్ విషయంలో ఎవరికి ఎన్ని హెచ్చరికలు చేసినా సరే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వైరస్ వ్యాప్తి అనేది చాలా వేగంగా ఉన్నా సరే ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇక కరోనా వైరస్ కి సంబంధించి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవడం లేదు అనే అభిప్రాయం కూడా కొంతవరకు వ్యక్తమవుతోంది. అయితే కొంతమంది కొన్ని అంశాలను టార్గెట్ చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉంటారు.

మసీదుల్లో అదేవిధంగా ప్రార్థనా మందిరాల్లో ఎన్ని ప్రార్ధనలు జరిగిన సరే పట్టించుకోని చాలా మంది హిందూ కార్యక్రమాల విషయంలో మాత్రం కరోనా వైరస్ అనేది చాలా వేగంగా విస్తరిస్తుంది అని ఆరోపణలు చేయడం చాలా విస్మయానికి గురి చేసే అంశం. ఉత్తరాఖండ్ లో కుంభమేళ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది అక్కడి ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని దీన్ని నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమం విషయంలో కొంతమంది కొన్ని ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. కుంభమేళా కారణంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేసే అంశం.

ఇక మర్కజ్ లో  కేసులు పెరిగాయి అని ఆరోపిస్తే ఒక మతాన్ని టార్గెట్ చేశారు అంటూ మాట్లాడే చాలామంది ఈ విషయంలో మాత్రం కుంభమేళ  కారణంగానే పెరిగాయి అని చెప్పడం ఆగ్రహానికి కారణం అవుతుంది అనే చెప్పాలి. మనదేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కూడా నిబంధనలు కూడా విధిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కొన్ని అంశాలను మాత్రమే పట్టించుకునే ప్రజలు వాస్తవాలను గ్రహించి విషయంలో కూడా బేధాభిప్రాయాలు చూపిస్తున్నారు అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: