జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కాదు.. పేద విద్యార్థులకు ఎంతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో పథకాలను కూడా ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం.  అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలలో జగనన్న విద్యా కానుక పథకం కూడా ఒకటి.  ఇప్పటికే అమ్మ ఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఇక పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఏకంగా పది వేల రూపాయలను విద్యార్థి తల్లి ఖాతాలో వేసేందుకు సిద్ధమయింది ప్రభుత్వం.



 తద్వారా ఎంతో మంది పిల్లలను చదివించే స్తోమత లేని వారు సైతం ప్రస్తుతం తమ పిల్లలను బడికి పంపించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో నాడు నేడు అనే కార్యక్రమంతో పాఠశాల రూపురేఖలు మార్చేసింది.  ఇక ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చేందుకూ నిర్ణయించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు సిద్ధమైంది. ఇక నాడు నేడు కార్యక్రమం లో భాగంగా స్కూల్ పిల్లలకు టెక్స్ట్ బుక్కులు, నోట్ బుక్కులు.. అంతే కాకుండా ఇక యూనిఫామ్ , బూట్లు,  బెల్ట్, టై లాంటివి అందిస్తుంది ప్రభుత్వం. ఇటీవలే ఏపీలో జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం .



 ఈ క్రమంలోనే జగనన్న విద్యా కానుక విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదు  అంటూ హెచ్చరించింది ఏపీ ప్రభుత్వం. జగనన్న విద్యా కానుక పథకం లోని వస్తువులను గడువులోగా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. లేదంటే గుత్తేదారులకు జరిమానా తప్పదు అంటూ హెచ్చరించింది. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల స్పష్టం చేశారు. ఈ నెల 16 లోపు ఇక రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు కూడా విద్యా కానుక కిట్స్ పంపిణీ  చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కాగా జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న జగనన్న విద్యా కానుక పథకాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ఆగస్టు 16వ తేదీన సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: