టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలకు నెమ్మదిగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సాధారణ ఎన్నికల తర్వాత పలువురు కీలక నేతలు పార్టీ మారిపోవడం, కొందరు కాడి కింద పడేయడంతో 30 నాటిక వర్గాలకు ఇన్చార్జులు  లేకుండాపోయారు. పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించేం దుకు  ఎవరూ లేకపోవడంతో ఆ నియోజక  వర్గాల్లో టిడిపికి దిక్కు దివానం లేకుండా పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో అధికారం అందని ద్రాక్ష అవుతుందని భావించిన చంద్రబాబు ఆయా నియోజకవర్గాల్లో బలమైన ఇన్చార్జి లను పెట్టుకుంటూ వస్తున్నారు. గత రెండు నెలల్లోనే 10 నియోజకవర్గాలకు కొత్త నేతలు వచ్చారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన కొవ్వూరు నియోజక వర్గం బాధ్యతల విషయంలో మాత్రం చంద్రబాబు సంకటస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఇక్కడి నుంచి 2014 ఎన్నికల్లో పోటీచేసిన కె ఎస్ జవహర్, ఆ తర్వాత మంత్రిగా కూడా పని చేశారు. జవహర్ మంత్రి అయ్యాక  కొవ్వూరు నియోజకవర్గం లో టిడిపి రాజ కీయాలను శాసించే పెండ్యాల అచ్చిబాబు, కొందరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన  నేతలు జవహర్ కి వ్యతిరేకం అయిపోయారు. మంత్రిగా జవహర్  పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించారు. ఎస్సీ నేతల్లో ఇంత తక్కువ టైంలో కీలక నేతగా ఎదిగిన నేత ఆయనొక్కరే. పెద్ద వివాదాలోనూ ఎక్కువగా ఉండరు. గత ఎన్నికల్లో ఆయన అక్కడే పోటీ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన  కమ్మ సామాజిక వర్గం నాయకుల ముందు తలవంచక తప్పలేదు. చివరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక జవహర్ ను  కృష్ణాజిల్లాలోని తిరు వూరు నుంచి పోటీ చేయించి, అప్పుడు విశాఖజిల్లాలోని పాయకరావుపేట ఎమ్మెల్యే గా ఉన్న వంగలపూడి అనిత కొవ్వూరు బరిలో దింపారు.

గత ఎన్నికల్లో కొవ్వూరు తిరువూరు 2 చోట్ల టీడీపీ ఓడిపోయింది. తిరువూరులో గట్టిపోటీ ఇచ్చిన జవహర్ ఎన్నికలు ముగిసినప్పటికీ కొవ్వూరు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా తిరువూరు కు దేవదత్తను ఇన్చార్జిగా చంద్రబాబు ప్రకటించారు. అంతకుముందే పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులను చంద్రబాబు ప్రకటించి నప్పుడు జవహర్ వ్యూహాత్మకంగా రాజమహేంద్ర వరం పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు. అప్పుడే జవహర్ కొవ్వూరు  ఇన్చార్జ్ ఇస్తామని ప్రచారం జరిగింది. అయితే పార్టీలో ఉన్న స్థానిక నేతలు చంద్రబాబుపై లాబీయింగ్ ప్రారంభించడంతో చంద్రబాబు మౌనంగా ఉంటూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: