హుజురాబాద్  పార్టీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు కాదు వారి యొక్క భార్యలు కూడా ఈ యొక్క ఉప ఎన్నికను చాలా దీటుగా తీసుకుంటున్నారు. ఎంతో ఉత్కంఠగా సాగుతున్న ఈ ప్రచారంలో ఆ మహిళలు మాత్రం తనదైన శైలిలో ప్రచారం లో ముందుకు వెళ్తున్నారు. ఇంతకీ ఎవరా మహిళలు..? ఈ ఉప ఎన్నికల్లో వారి భర్తలు నువ్వానేనా అన్నట్టుగా ప్రచారంలో దూసుకెళ్తున్న ఉండగా  నీవు ఏమైనా తక్కువ తిన్నామా అంటూ ప్రచారంలో వారి భార్యలు కూడా నువ్వానేనా అన్న విధంగా దూసుకెళుతున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్ సతీమణి అయిన జమున ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.

అలాగే టిఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ యాదవ్ సతీమణి కూడా తన భర్త గెలుపు కొరకు అహర్నిశలు శ్రమిస్తూ వస్తోంది. ప్రతి గ్రామంలో తిరుగుతూ  బొట్టు పెడుతూ, చాయ్ చేస్తూ  గ్రామాల్లో చిన్న పెద్ద చూడకుండా ప్రేమగా పలకరిస్తూ  వారి మంచి చెడు నడుపుతూ జనాలు తమ వైపు తిప్పుకునే ఎలా ముందడుగు వేస్తున్నారు.

 అయితే ఇప్పటికే ఈటల రాజేందర్ సతీమణి జమున చాలా రోజుల నుంచి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె తన ప్రచారాన్ని కమలాపూర్ మండలం నుంచి ప్రారంభం చేశారు. అయితే ఆమె జూన్ మాసం నుంచే తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తన భర్త ఒక మండలంలో, ఈమె మరో మండలంలో  ఇలా తన ప్రచార శైలిని కొనసాగిస్తూ వస్తున్నారు. వారికి జరిగినటువంటి అన్యాయాన్ని ఓటర్ల వివరిస్తూ  ఎప్పటికప్పుడు సభలు సమావేశాలతో దాదాపు అంతా బాద్ నియోజకవర్గం మొత్తం ఇప్పటికే పూర్తి చేశారు అని చెప్పవచ్చు. ఓవైపు ఈటెల రాజేందర్ మరోవైపు ఆయన సతీమణి జమున బిజెపి కార్యకర్తలు ప్రచారంలో దూసుకుపోతూ, ఇంకోవైపు గెల్లు శ్రీనివాస్ ఆయన భార్య శ్వేత టిఆర్ఎస్ కార్యకర్తలతో హుజరాబాద్ నియోజకవర్గం అంతా ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: