గత ఎన్నికల్లో జగన్ వేవ్‌ని తట్టుకుని టి‌డి‌పి తరుపున ముగ్గురు ఎంపీలు గెలిచిన విషయం తెలిసిందే. కేంద్రం మెడలు వంచి హోదా తెచ్చిస్తాను...25 ఎంపీ సీట్లు ఇవ్వండని జగన్ ప్రచారం చేయడంతో....జనాలు కూడా జగనన్న...నిజంగానే కేంద్రం మెడలు వంచేస్తరేమో అనుకుని....వైసీపీకి 25 కాదు గానీ....22 ఎంపీలని ఇచ్చారు. ఇక రాష్ట్రం కోసం పోరాడే టి‌డి‌పి ఎంపీలని ముగ్గురుని గెలిపించారు. అయితే ఎన్నికలయ్యాక ఆ టీడీపీ ఎంపీలే బెటర్ అని జనాలకు బాగా క్లారిటీ వచ్చేసింది.

వైసీపీ తరుపున 22 మంది ఎంపీలు చేసేది ఏమి లేదని, జగన్ కేంద్రం మెడలు వంచలేరని తెలిసిపోయింది. అయితే కొద్దో గొప్పో టి‌డి‌పి ఎంపీలే రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. ఇక వారిని జనం మళ్ళీ గెలిపించేలా ఉన్నారు...వారికి వైసీపీ ఏ మాత్రం చెక్ పెట్టేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆ ముగ్గురు టి‌డి‌పి ఎంపీలు బలంగానే ఉన్నారు. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు బలం ఏంటో ప్రత్యేకంగా చెప్పాలసిన పని లేదు.

ఇంకా అక్కడ రామ్మోహన్‌కు మద్ధతు పెరుగుతుందే తప్ప...తగ్గడం లేదు. పైగా రామ్మోహన్‌కు ధీటుగా వైసీపీలో సరైన నాయకుడు లేరు. ఈ పరిస్తితిని చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో రామ్మోహన్ మళ్ళీ గెలవడం ఖాయమని తెలుస్తోంది. ఇటు వస్తే విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. పైగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో టి‌డి‌పి ఇంకా బలపడుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అంటున్నారు గానీ, చంద్రబాబు....ఎలాగైనా నానీనే ఒప్పించి నిలబెట్టేలా ఉన్నారు. నాని నిలబడితే మళ్ళీ టి‌డి‌పి గెలుపు ఖాయమే.

ఇక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. పైగా అమరావతి అంశం గల్లాకు బాగా ప్లస్ అవుతుంది. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టి‌డి‌పి బాగా బలపడింది. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో గల్లా విజయానికి ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: