రాజకీయాల్లో బలమైన నేతలని ఢీకొట్టడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పొచ్చు. అంత సులువుగా కొండలాంటి నాయకులని ఢీకొట్టలేరు. కానీ ఆ పని టి‌డి‌పి యువ నాయకుడు కిమిడి నాగార్జున చేస్తున్నారు. తనకు సాధ్యం కాకపోయినా కొండలాంటి బొత్స సత్యనారాయణని ఢీకొట్టడానికి గట్టిగా కష్టపడుతున్నారు. అసలు విజయనగరం జిల్లాలో బొత్సకి ఎలాంటి ఫాలోయింగ్ చెప్పాల్సిన పని లేదు. ఇక తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో బొత్సని ఢీకొట్టే నాయకుడే లేరనే చెప్పొచ్చు.

జగన్‌కు పులివెందుల ఎలా ఉంటుందో....బొత్సకు చీపురుపల్లి అలా ఉంటుంది. ఇక్కడ ప్రజలు బొత్సకు అంతలా అండగా ఉంటారు. ఆఖరికి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి మరీ దారుణంగా అయినా కూడా చీపురుపల్లిలో బొత్సకు ఎక్కువగా ఓట్లు పడ్డాయి. 2014లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి బొత్స మంచిగానే ఓట్లు తెచ్చుకుని సెకండ్ ప్లేస్‌లో నిలబడ్డారు.


ఆ తర్వాత వైసీపీలో చేరి ఎలా సత్తా చాటారో చెప్పాల్సిన పని లేదు. చీపురుపల్లిలో భారీ మెజారిటీతో గెలిచి మరొకసారి ఎమ్మెల్యే అయ్యి...మరొకసారి మంత్రి అయ్యారు. అయితే ఇలా బలంగా ఉన్న బొత్సకు చెక్ పెట్టడానికి నాగార్జున గట్టిగా కష్టపడుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా సరే, 2024 ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని నాగార్జున ప్రయత్నిస్తున్నారు. యువ నాయకుడు కావడంతో నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటున్నారు.


అటు విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడుగా కూడా నాగార్జున పనిచేస్తున్నారు. పార్లమెంట్ అధ్యక్షుడుగా విజయనగరం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే పార్లమెంట్ అధ్యక్షుడుగా నాగార్జున కొంతవరకు అయ్యేలా కనిపిస్తున్నారు...కానీ చీపురుపల్లి ఇంచార్జ్‌గా సక్సెస్ అయ్యేలా లేరు. ఎందుకంటే చీపురుపల్లిలో బొత్సని ఓడించడం అసాధ్యం. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అక్కడ నాగార్జునకు గెలవడానికి ఛాన్స్ లేదు. మరి బొత్స ఆ ఛాన్స్ నాగార్జునకు ఇస్తారేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: