సైన్యంలో కూడా పాక్ స్లీపర్ సెల్ ఏర్పాటు చేసినట్టు అప్పట్లో వార్తలలో విన్నాం. తాజాగా అది రుజువైంది. పాక్ ప్రేరేపిత తీవ్రవాది సరిహద్దు సైన్యంలో పనిచేస్తూ, ఆ దేశానికీ సమాచారం ఇస్తున్నట్టు కనుగొన్న అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు సైన్యంలో చేరినప్పుడే నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చినట్టుగా అధికారులు దర్యాప్తులో కనిపెట్టారు. పాక్ గెలిస్తే సంబరాలు చేసుకోవడం, తీవ్రవాదులకు కూడా మానవహక్కులు అంటూ మాట్లాడేవాళ్ళు ఇలా మొత్తానికి ఎక్కడ లేరు వాళ్ళు అన్న చందాన నేడు స్లీపర్ సెల్స్ వ్యాపించాయి. అయితే సైన్యంలో కూడా ఉండటం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తున్నప్పటికీ తాజాగా ఇంటి దొంగను కనిపెట్టడంతో ఈ అనుమానం కూడా తీరిపోయింది. అంటే ప్రతి చోట కూడా పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు ఉన్నారని అర్ధం అయిపోతుంది.

తాజాగా పట్టుకున్న బి.ఎస్.ఎఫ్ జవాన్ తన తమ్ముడుకు నగదు పంపిస్తుండటం, దేశసమాచారాన్ని వాట్స్యాప్ ద్వారా పాక్ చేరవేస్తుండటం కనిపెట్టారు అధికారులు. దీనితో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని గుజరాత్ లోని యాంటీ టెర్రరిజం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ లోని బుజ్ బెటాలియన్ కు చెందిన జవాన్, ఇతడు జమ్మూ కాశ్మీర్ లోని రాజోలి జిల్లాకు చెందినటువంటి మహమ్మద్ సజ్జార్ గా గుర్తించారు. బుజ్ లోని బి.ఎస్.ఎఫ్ 74వ బెటాలియన్ లో ఏడాది జులై లో నియమితుడయ్యాడు. 2012లో కానిస్టేబుల్ గా చేరి పాక్ కు రహస్య సమాచారం అందిస్తున్నాడు. సోదరుడు ఇక్బల్ రషీద్ ఖాతాలోకి నగదు జమ అయినట్టు అధికారులు గుర్తించారు.

అలాగే జమ్మూలో రీజినల్ పాస్ పోర్ట్ను  కూడా అతడు తీసుకున్నాడు. 2011 డిసెంబర్ 1- 2012 జనవరి మధ్య 46 రోజులపాటు ఇతడు పాక్ లో పర్యటించినట్టు అందుకు అటారీ రైల్వే స్టేషన్ నుండి సంజాత ఎక్ష్ప్రెస్స్ లో అతడు పాక్ కు వెళ్లినట్టు కనిపెట్టారు. ఈ పర్యటనలో అతడు పాక్ లో తీవ్రవాద శిక్షణ తీసుకున్నది లేనిది తెలియాల్సి ఉంది. ఇక రహస్య సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పాక్ కు చేరవేస్తున్నట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: