తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈటెల రాజేంద్ర గెలుపుతో సంతోషంగా ఉంది. ఈటెల రాజేంద్ర విజయంతో ఆయన పని తీరు సామర్ధ్యంపై ఆ పార్టీ రాష్ట్ర నేతలు చాలా సంతోషంగా ఉండి ఏకంగా సన్మాన సభ కూడా ఏర్పాటు చేసారు. నేడు బిజెపి కార్యాలయంలో సన్మాన సభ జరగగా ఈ సభకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటుగా పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈటెల పని తీరుని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఈటెల పాత్ర కీలకమన్న కేంద్రమంత్రి...

విజయ గర్జన కాదు.. వరంగల్ లో కల్వకుంట్ల గర్జన పెట్టుకోవాలని ఎద్దేవా చేసారు. తెలంగాణను వ్యతిరేకులు..‌ ప్రగతి  భవన్, తెలంగాణ భవన్లో ఉంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమకారులు, కవులు, కళాకారులు బీజేపీలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అన్నారు ఆయన. తెలంగాణలో ప్రజా పాలన బీజేపీతో మాత్రమే సాధ్యం  అని స్పష్టం చేసారు.  బీజేపీ వలనే పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పెట్టింది అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర రాజకీయాలను హుజురాబాద్ ఉప ఎన్నిక మలుపు తిప్పింది అన్నారు కేంద్ర మంత్రి.

ఈటెల రాజేంద్ర కారణంగానే దళితబంధు పథకం వచ్చింది అని ఆయన తెలిపారు. హుజురాబాద్ ఎన్నిక కోసమే టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాటు చేశారు అని వ్యాఖ్యలు చేసారు. ఈటెల రాజేంద్ర గెలుపులో కీలకపాత్ర పోషించిన హుజురాబాద్ మహిళలకు సెల్యూట్ చేసారు. ప్రజల ముందు ఈటలను దోషిగా నిలబెట్టాలన్న సీఎం ఆలోచనలకు గండి ప్రజలు కొట్టారు అని అన్నారు. ఈటెల రాజేంద్ర గెలుపులో జమున రాజేందర్ పాత్ర కీలకం అని ఆయన తెలిపారు. ఒక్క కేసీఆర్ కుటుంబం వలనే తెలంగాణ రాలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. హుజురాబాద్ పోరాటం బీజేపీ భవిష్యత్తుకు నాంది కానుంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts