ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏదొకవిధంగా ఒక నాయకుడు పేరు బాగా హల్చల్ అవుతూనే వస్తుంది. ఆయన అసలు రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోయినా సరే...ఆ నాయకుడు చుట్టూ అనేక రకాలుగా రాజకీయం నడుస్తోంది. అలా మనిషి కనిపించకుండా తెరవెనుక ఉంటూ రాజకీయం నడిపిస్తున్న నాయకుడు ఎవరో ఈ పాటికి అందరికీ అర్ధమైపోయి ఉంటుంది...ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ నియోజకవర్గంలో ఉన్నా సరే గెలిచే గంటా శ్రీనివాసరావు చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది.

ఇప్పటివరకు గంటా ఎన్ని పార్టీలు మార్చారు...ఎన్ని నియోజకవర్గాలు మార్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్ని మార్చినా సరే ఈయనకు ఓటమి తెలియదు. ఇంతవరకు గెలుస్తూనే వచ్చారు. కానీ గెలిచాక ఎప్పుడు రాజకీయాల్లో కనిపించకుండా సైలెంట్‌గా లేరు. కానీ 2019 ఎన్నికల తర్వాత గంటా పూర్తిగా సైలెంట్ అయ్యారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. పైగా రాజకీయాలకు దూరంగా ఉంటూ నియోజకవర్గ ప్రజలకు ఏమన్నా అందుబాటులో ఉంటున్నారా? అంటే అది లేదు.

అసలు ఈయన బయటకు కనిపించడం లేదు...టీడీపీలో పనిచేయడం లేదు. పోనీ వేరే పార్టీలోకి వెళ్ళడం లేదు. ఇప్పటికే వేరే పార్టీలోకి జంప్ చేస్తున్నారని ప్రచారం వచ్చింది. మొదట్లో బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లారని ఇంకా ఆయన బీజేపీలో చేరిపోవడం ఖాయమని ప్రచారం వచ్చింది. అబ్బే లేదు...వైసీపీలో చేరడం ఫిక్స్ అయిపోయిందని కథనాలు వచ్చాయి. జగన్‌తో అంతా మాట్లాడేసుకున్నారని, ఇంకా పార్టీలో చేరడమే తరువాయి అని వార్తలు వచ్చాయి. కానీ అది కూడా జరగలేదు. తాజాగా గంటా జనసేనలో చేరిపోతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. మొదట ఆయన తనయుడుని జనసేనలో చేర్చి, ఆ తర్వాత ఆయన పార్టీలో చేరతారని ప్రచారం మొదలైంది.

ఇన్నిరకాలుగా ప్రచారం నడుస్తున్నా సరే గంటా ఎప్పుడు బయటకొచ్చి మాట్లాడలేదు. అయితే పార్టీ మారే విషయంలో గంటా పూర్తిగా క్లారిటీగా ఉన్నారని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల ముందు రాజకీయ పరిస్తితులని బట్టి గంటా పార్టీ మారిపోతారని తెలుస్తోంది. అప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీలోనే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: