డ‌బ్బులున్నోళ్లంతా సేవ కోసం సాయం కోసం డ‌బ్బులు ఇవ్వాల‌న్న రూల్ లేదు. డ‌బ్బులున్నోళ్లంతా మంచి మ‌న‌సుతో కూడిన ప‌నులు చేయాల‌న్న రూల్ అంత క‌న్నా లేదు. స‌రిప‌ల్లి కోటిరెడ్డి దంప‌తులు మాత్రం ఇందుకు భిన్నం. మంచి మ‌న‌సు సాయం చేసే గుణం ఆదుకునే ల‌క్ష‌ణం స్పందించే మ‌న‌స్త‌త్వం క‌ష్టం అంటే క‌ద‌లి అండ‌గా నిలిచే మాన‌వ‌త్వం అన్న‌వి ఆ దంపతుల‌కు భ‌గ‌వంతుడే ఇచ్చిన వ‌రాలు. ఆ వరాలు ఎంద‌రికో పంచారు. శాపంగా మారిన బాల్యాన్ని వ‌రంగా మార్చారు. వ‌ర సిద్ధి పొందిన బాల‌లు కొత్త జ‌న్మ‌ను అందుకున్నారు. స‌రిప‌ల్లి కోటిరెడ్డి స‌ర్ మాట్లాడితే ఆశావ‌హ దృక్ప‌థం త‌ప్ప ఇంకేమీ ఉండ‌దు.


 శ్రీజా రెడ్డి మాట్లాడితే పిల్ల‌ల‌కు కొత్త జీవితం ఇవ్వాల‌న్న దృక్ప‌థం త‌ప్ప సొంత లాభం క‌నప‌డ‌దు. అవును సొంత లాభం ఏమీ ఉండ‌దు. తోటి వారికి దేవుడు ఇచ్చిన దాంట్లో కొంత ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌తో సంస్థ ను న‌డుపుతున్నారు. పినాకిల్ బ్లూమ్స్ ను ఉన్న‌తంగా తీర్చిదిద్దుతున్నారు. త‌న బిడ్డ‌కు వ‌చ్చిన క‌ష్టం ఇంకెవ్వ‌రికీ రాకూడ‌దన్న త‌లంపుతో తెలుగు రాష్ట్రాలు గ‌ర్వించేలా కోట్లు వెచ్చించి ఆటిజం థెర‌ఫీ సెంట‌ర్లు నెల‌కొల్పారు. ఇందుకు పూర్తి పూర్వ జ్ఞానం వారికి ఉంది. స‌మస్య‌పై పూర్తి వైజ్ఞానిక దృక్ప‌థం ఉంది. అందుకు అనుగుణంగా ప‌రిష్కారానికి సంబంధించి ఆ దంప‌తులు చేస్తున్న ప్ర‌య‌త్నాలు చిన్నారుల మోముల్లో వారి త‌ల్లిదండ్రుల హృద‌యాల్లో కొత్త సంతోషాలు నింపుతున్నాయి. ఇవాళ చిల్డ్ర‌న్స్ డే క‌నుక ఆ సంస్థ చేసిన మంచి ప‌నులు కొన్నయినా త‌లుచుకోవాలి.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయి. బుద్ధి మాంద్యం, ప్ర‌త్యేక అవ‌స‌రాలు ఉన్న పిల్లలు, మాన‌సిక ఎదుగ‌ద‌ల లేని పిల్ల‌లు, న్యూరాల‌జీకి సంబంధించి  అవ‌స్థ ప‌డుతున్న పిల్ల‌లు ఇలా ఎన్నో.. వీట‌న్నింటిపై స‌మకాలీన అధ్య‌య‌నం ఒక‌టి కావాలి. ఒక థెర‌ఫీ సెంట‌ర్ కావాలంటే ముందు వాటిపై అవ‌గాహ‌న ఉండాలి. డబ్బు ఒక్క‌టే కాదు అందుకు ప‌రిష్కారం. నిపుణులు వారితో నిర్వ‌హించే సెష‌న్స్..ఇవ‌న్నీ ఆ సంస్థ ఎదుగుద‌ల‌కు స‌మ‌స్య‌పై ప‌ది మందికీ అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సాయ‌ప‌డ‌తాయి. కోటిరెడ్డి దంప‌తులు రెండు తెలుగు రాష్ట్రాల‌కే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ స‌మ‌స్య తో బాధ‌ప‌డుతున్న పిల్ల‌ల‌కు అండ‌గా ఉంటున్నారు. ఆన్లైన్ క్లాసులు మ‌రియు కోర్సులు ఉచితంగానే ఇస్తున్నారు. ప్ర‌భుత్వాలు ముందుకు వ‌స్తే రెండు నుంచి మూడు ల‌క్ష‌లు వెచ్చించి జిల్లాకో ఆటిజం థెర‌ఫీ సెంట‌ర్ తామే నిర్వ‌హిస్తామ‌ని చెబుతున్నారు. ఇంకా ఎన్నో మంచి ప‌నుల‌కు తమ వంతు బాధ్య‌తను నిర్వ‌ర్తిస్తున్నారు. చెప్పానుగా ఉన్నోళ్లంతా పంచాల‌న్న రూలేం లేదు. కానీ సామాజిక బాధ్య‌త ఒక్క‌టే కాదు చేయాల‌న్న దృక్ప‌థం కూడా మంచి  మార్పునకు  సంకేతికే!

మరింత సమాచారం తెలుసుకోండి: