క‌రోనా ఇప్పుడిప్పుడే త‌గ్గుతుంద‌నుకున్న నేప‌థ్యంలో కొత్త వేరియంట్ `ఒమిక్రాన్‌` బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌రోసారి ప్ర‌పంచ దేశాల‌ను భ‌యం గుప్పిట్లోకి తీసుకెళ్తోంది. వేగంగా విస్త‌రిస్తున్న ఈ వేరియంట్ ప్ర‌భావంతో మ‌రింత వేగంగా కేసులు పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. కొత్త ర‌కం వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత ప్ర‌మాద‌కారి అని ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌టించింది. తాజాగా సింగ‌పూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒమిక్రాన్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. డెల్టా, బీటా వేరియంట్ల‌తో పోల్చితే ఒమిక్రాన్ వ‌ల్ల రీఇన్ఫేక్ష‌న్ ముప్పు ఎక్కువ‌ని, మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రారంభ క్లినికల్ ప‌రీక్ష‌లు సూచిస్తున్నాయ‌ని సింగ‌పూర్ మంత్రి పేర్కొన్న‌ట్టు అక్క‌డి స్థానిక మీడియా వెల్ల‌డించింది.


 గతంలో కొవిడ్ భారిన ప‌డిన వారు ఇప్పుడు ఒమిక్రాన్ సోకే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.  అయితే, ఒమిక్రాన్ విష‌యంలో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ప‌ని చేస్తాయా అన్న అంశంపై అధ్య‌య‌నం కొన‌సాగుతోంది. కానీ, కొంద‌రు ప‌రిశోధ‌కులు ఈ టీకాలు ఒమిక్రాన్‌పై పని చేస్తాయ‌ని, మరి ముఖ్యంగా వైర‌స్ తీవ్ర త‌రం కాకుండా అడ్డుకుంటుంద‌ని చెబుతున్నారు. కాబ‌ట్టి, వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవాల‌ని, వేసుకున్న వారు బూస్ట‌ర్ డోసులు వేసుకునేందుకు ముందుకు రావాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.
ఇక ద‌క్షిణాఫ్రికా, యూర‌ప్‌లో ఒమిక్రాన్ సోకిన వారిలో యువ‌త ఎక్కువ‌గా ఉంద‌ని ప్రాథ‌మిక స‌మాచారం తెలుపుతోంది.


    అలాగే, రాబోయే రోజుల్లో ఐరోపాలో భారీ ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వారం రోజుల్లోనే 41 దేశాల‌కు పైగా ఒమిక్రాన్ వైర‌స్ విస్త‌రించిన నేప‌థ్యంలో ఆయా దేశాలు త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల్సిన అవ‌స‌రం ఉందిని నిపుణులు సూచిస్తున్నారు. ఇక భార‌త దేశంలో ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోద‌యిన‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. రాబోయే నెలల్లో కొవిడ్‌-19 లాగా ప్ర‌పంచ దేశాల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో అనే ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: