తెలుగుదేశం పార్టీలో కొన్ని కొన్ని విభాగాలకు సంబంధించి కాస్త పార్టీ అధిష్టానం జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. పార్టీలో చాలామంది నాయకులు ఈ మధ్యకాలంలో గట్టిగా మాట్లాడక పోవడం పట్ల చాలా వరకు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అంశాలకు సంబంధించి చాలా వరకు కూడా చంద్రబాబు నాయుడు సలహాలు సూచనలు ఇచ్చే పరిస్థితులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని విభాగాల్లో లేవు అనే మాట కూడా వినపడుతోంది.

ఇక టీడీపీ అధిష్టానం ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని విభాగాలను బయటకు తీసుకురావడం పట్ల కాస్త భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. itdp పేరుతో ఇటీవల తెలుగుదేశం పార్టీ కొత్త విభాగాన్ని బయటకు తీసుకు రాగా దీనికి సంబంధించి పార్టీ కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తలకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉన్నారు అనే కారణంతో ఈ విభాగంలో పదవులు ఇవ్వడం తో చాలా వరకు కూడా తెలుగు యువత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది అని ప్రచారం జరుగుతోంది.

గతంలో తెలుగు యువతలో పదవుల కోసం ఎదురు చూసిన వారికి ఎటువంటి పదవులు రాకపోగా ఇప్పుడు itdp పేరుతో కొత్త విభాగం తీసుకొచ్చి దీంట్లో పదవులు ఇవ్వడానికి ఏ మాత్రం కూడా టిడిపి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉత్సాహంగా ఉండే చాలా మంది కార్యకర్తలను పార్టీ పక్కన పెడుతోందని చిన్న చిన్న పదవుల కోసం ఆశపడి సోషల్ మీడియాలో హుషారుగా ఉండే వాళ్లను ముందుకు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేయడం ఎంతవరకు కూడా టిడిపి కార్యకర్తలకు అలాగే అధిష్టానానికి మంచిది కాదు అనే అభిప్రాయాన్ని కొంత మంది కార్యకర్తలు బహిరంగంగా వ్యక్తం చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: