భారత రాజకీయాలలో భీష్మ పితామహుడని ప్రణబ్ ముఖర్జి పేరు ఉంది.5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటు పోటులను ఎత్తు పల్లాలను చూసారు. ఆదర్శ రాజకీయ నాయకుడిగా తన ప్రస్థానం సాగించాడు. ఇతరులను తన వాక్చతుర్యంతో ఒప్పించడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పవచ్చు. చేపట్టిన పదవులకు తనదైన పని తీరుతో వన్నె తెచ్చిన నాయకుడు ప్రణబ్ ముఖర్జీ.నేటి యువతకు ఆయన ఒక ఆదర్శమైన ప్రణబ్ ముఖర్జీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రణబ్ ముఖర్జి డిసెంబర్ 11, 1935 న పశ్చిమ బెంగాల్ లో జన్మించారు.1952 నుండి 1964 వరకు పశ్చిమ బెంగాల్ లెగిస్లేటివ్ కౌన్సిల్ లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యునిగా ఏఐసిసీ సభ్యునిగా వున్నారు.1969 లో జరిగిన  బంగ్లా-కాంగ్రెస్ సమావేశంలో ధాటిగా ప్రసంగిస్తున్న ఒక యువకుడిని చూసి ప్రధాని ఇందిరా గాంధీ ముగ్దలైనారట. ఇలాంటి నాయకుడు తన బృందం లో ఉండాలని భావించి వెంటనే రాజ్య సభకు ఎంపిక చేసారు. అప్పటికి అయన వయస్సు 35 సంవత్సరాలు మాత్రమే అని తెలుస్తుంది.

 పెద్దల సభకు ఒక నవ యువకుడు ఆ సభకు రావడం తో అందరూ ఆశ్చర్య పోయారని సమాచారం. అప్పటి నుంచి ప్రణబ్ కు వెనుదిరిగి చూసే పరిస్థితి రాలేదని తెలుస్తుంది.1973 లో ఆయన కేంద్ర మంత్రి అయ్యారు.1982లో అత్యంత ఖీలక ఆర్థికశాఖ మాత్యులుగా వ్యవహారించారు. అప్పటికి ఆయనకి వయస్సు 47సంవత్సరాలు. అంత చిన్న వయసులో ఆర్ధికశాఖ మంత్రి అయింది ఆయన ఒక్కరే అవ్వడం విశేషం.అప్పట్లో ఆర్ధిక శాఖ  మంత్రి గా ఉన్న మన్ మోహన్ సింగ్ ను rbi గవర్నర్ గా చేసారు. ఇందిరాగాంధీ హత్యకు గురి అయిన తరువాత సీనియర్ అయిన ప్రణబ్ ప్రధాని అవుతారని అందరూ అంచనా వేశారు. కానీ ఆమె కుమారుడు. రాజీవ్ గాంధీ కి పగ్గాలు లభించాయి

మరింత సమాచారం తెలుసుకోండి: