తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రంగా సాగుతున్న విషయం తెలిసిందే. అసలు రెండు పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది...మరొక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఎక్కడా తగ్గకుండా దూసుకెళుతున్నాయి. అసలు తొలిసారి అధికారంలోకి రావడానికి బీజేపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది. టీఆర్ఎస్‌కు ఎలాగో ఉపఎన్నికల్లో చెక్ పెట్టేసింది..అందుకే ప్రధాన ఎన్నికల్లో కూడా చెక్ పెట్టేసి అధికారంలోకి వచ్చేయాలని చూస్తుంది.

ఇటు టీఆర్ఎస్ మాత్రం...బీజేపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని ముందుకెళుతుంది. మరొకసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. అసలు రెండు పార్టీల మధ్యే వార్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఇక బండి సంజయ్ అరెస్ట్ తర్వాత సీన్ మరింతగా మారిపోయింది. సరే రెండు పార్టీల మధ్య రచ్చ జరుగుతుంది...కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏమైందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

అసలు వాస్తవానికి బీజేపీ కంటే కాంగ్రెస్ బలమైన పార్టీ...రాష్ట్రంలో బలమైన క్యాడర్, బలమైన నాయకులు ఆ పార్టీకే ఉన్నారు. మరి అలాంటప్పుడు బీజేపీ ఎలా రేసులోకి వచ్చింది. టీఆర్ఎస్ కూడా బీజేపీని ఎందుకు టార్గెట్ చేసిందనే డౌట్లు వస్తున్నాయి. అయితే ఇదంతా పోలిటికల్ గేమ్ అని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. కేవలం కాంగ్రెస్‌ని దెబ్బకొట్టడానికి కారు, కమలం పార్టీలు ఆడుతున్న డ్రామా అని అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలో పెట్టడానికి చూస్తున్నారని అంటున్నారు. ఇక ఇలా చేయడం వెనుక కారణాలు ఉన్నాయని, బీజేపీని పైకి లేపడం వల్ల ఓట్లని చీల్చేసి అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వస్తున్నాయి.

కాంగ్రెస్‌ని దెబ్బకొట్టడం వల్ల బీజేపీకి కొన్ని ఓట్లు దక్కుతాయి. అటు కాంగ్రెస్‌కు కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఇలా ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని కాంగ్రెస్, బీజేపీలు పంచుకుంటే...టీఆర్ఎస్‌కే బెనిఫిట్ అవుతుందనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. అప్పుడు మూడోసారి అధికారంలోకి రావడానికి అవకాశం దక్కుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp